Tuesday, September 4, 2007

Swati Kiranam - teli maMchu

తెలిమంచు కరిగింది


తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ

నీ దోవ పొడవునా కువకువల స్వాగతము

నీ కాలి అలికిడికి మెలకువల వందనము


ఈ పూల రాగాల పులకింత గమకాలు

గారాబు కవనాల గాలి సంగతులు

నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు

పల్లవించును ప్రభూ పవళించు భువనాలు

భానుమూర్తి! నీ ప్రాణ కీర్తన విని

పలుకని ప్రణతులని ప్రణవ శృతిని

పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని


భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు

నీ రాజసానికవి నీరాజనాలు

పసరు పవనాలలో పసికూన రాగాలు

పసిడి కిరణాల పడి పదునుదేరిన చాలు

తలయూర్చు తలిరాకు బహుపరాక్కులు విని

దొరలనీ దోరనగవు దొంతరని

తరలనీ దారి తొలగి రాతిరిని

No comments:

Post a Comment