Saturday, January 2, 2021

Jaanu - Ye Dari Eduraina

 ఏదారెదురైనా

ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా
ఏంతోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతువున్నా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు !
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లెవరివి !

ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా నిలకడగ
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తోందో కేక…. మౌనంగా !

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల ఘుమ ఘుమలెవరివి

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా... విన్నారా !
నేను, నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న, అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది... జోలాలి !

Friday, February 5, 2016

Kanche - Itu Itu Itu Ani

 ఇటు ఇటు ఇటు అని


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో...ఏమో

సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారయ్యిందో సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా
తనోటిఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్నా మెళకువలో ఉన్నాం కదా
మన దరికెవరు వస్తారు కదిలించంగ
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటు పోతుందో
నిదుర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే
మనం అనే కథానిక మొదలైందో


పెదాల మీదుగ అదేమి గల గల పదాల మాదిరిగ
సుధాల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కద
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగ
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ
వినబోతున్న సన్నాయి మేళాలుగ
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

Rudraveena - Lalita Priya Kamalam


లలిత ప్రియ కమలం 

లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రఛాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి

Tuesday, August 3, 2010

Vedam - Malli Puttanee

మళ్లీ పుట్టనీ


ఉప్పొంగిన సంద్రంలా

ఉవ్వెత్తున ఎగిసింది

మనసును కడగాలనే ఆశ


కొడిగట్టే దీపంలా

మిణుకు మిణుకు మంటోంది

మనిషిగ బతకాలనే ఆశ


గుండెల్లో ఊపిరై

కళ్ళల్లో జీవమై

ప్రాణమై ప్రాణమై

మళ్లీ పుట్టనీ నాలో మనిషిని

Monday, August 2, 2010

Maryada Ramanna - Telugammayi

తెలుగమ్మాయి


రాయలసీమ మురిసిపడేలా

రాగలవాడి జన్మ తరించేలా

ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది

మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి తెలుగమ్మాయి

కళ్ళల్లో వెన్నెలై వెలుగమ్మాయి

అందుకోమన్నది నిన్ను తన చేయి


పలికే పలుకులో కొలికే తొలకరి

ఇంట్లో కురిసిందో సిరులే మరి

నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి

జంటై కలిసిందో తలపే హరి

హంసల నడకల వయారి అయిన

ఏడడుగులు నీ వెనకే

ఆశల వధువుగ ఇలాగ ఇలపై

జారిన జాబిలి తునకే తెలుగమ్మాయి తెలుగమ్మాయి


గీతలే అని చిన్న చూపెందుకు

వాటి లోతులు చూడలేవెందుకు

నదిలో పడవలా, వానలో గొడుగులా

గువ్వపై గూడులా, కంటిపై రెప్పలా

జతపడే జన్మకి తోడు ఉంటానని

మనసులో మాటని మనకు చెప్పకనే చెబుతుంది తెలుగమ్మాయి

గుండెనే కుంచెగా మలచిందోయి

Nee Kosam - Nee Kosam

నీకోసం


ఎపుడూ లేని ఆలోచనలు

ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం

ఈలోకమిలా ఏదో కలలా

నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది


నాలో ఈ ఇది ఏరోజూ లేనిది

ఏదో అలజడి నీతోనే మొదలిది

నువ్వే నాకని పుట్టుంటావని

ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా


నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది

వీణే పలకని స్వరమే నీ గొంతుది

మెరిసే నవ్వది మోనాలీసది

ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మను

Allari Priyudu - Aho Oka Manasuku Nede

అహో ఒక మనసుకు నేడే


అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే ఇదే కుహూ స్వరాల కానుక

మరో వసంత గీతిక జనించు రోజు


మాట పలుకు తెలియనిది

మాటున ఉండే మూగ మది

కమ్మని తలపుల కావ్యమయె

కవితలు రాసే మౌనమది

రాగల రోజుల ఊహలకి

స్వాగతమిచ్చే రాగమది

శృతిలయలెరుగని ఊపిరికి

స్వరములు కూర్చే గానమది

ఋతువుల రంగులు మార్చేది

కల్పన కలిగిన మది భావం

బ్రతుకును పాటగ మలిచేది

మనసున కదిలిన మృదునాదం

కలవని దిక్కులు కలిపేది

నింగిని నేలకు దింపేది

తనే కదా వారధి

క్షణాలకే సారధి మనస్సనేది


చూపులకెన్నడు దొరకనిది

రంగు రూపు లేని మది

రెప్పలు తెరవని కన్నులకు

స్వప్నాలెన్నో చూపినది

వెచ్చని చెలిమిని పొందినది

వెన్నెల కళగల నిండు మది

కాటుక చీకటి రాతిరికి

బాటను చూపే నేస్తమది

చేతికి అందని జాబిలిలా

కాంతులు పంచే మణిదీపం

కొమ్మల చాటున కోయిలలా

కాలం నిలిపే అనురాగం

అడగని వరములు కురిపించి

అమృతవర్షిని అనిపించే

అమూల్యమైన పెన్నిధి

శుభోదయాల సన్నిధి మనస్సనేది

Tuesday, October 13, 2009

Swati Kiranam - Aanati Neeyara

ఆనతినీయరా హరా


ఆనతినీయరా హరా

సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా

ఆనతినీయరా హరా


నీ ఆన లేనిదే రచింపజాలునా

వేదాల వాణితో విరించి విశ్వనాటకం

నీ సైగ కానిదే జగాన సాగునా

ఆయోగమాయతో మురారి దివ్యపాలనం

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

కదులునుగా సదా సదాశివా

ఆనతినీయరా హరా

అచలనాధ అర్చింతునురా

ఆనతినీయరా


జంగమదేవర సేవలు గొనరా

మంగళదాయక దీవెనలిడరా

సాష్టాంగముగ దండము చేతురా

ఆనతినీయరా


శంకరా శంకించకుర

వంకజాబిలిని జడను ముడుచుకుని

విషపునాగులను చంకనెత్తుకుని

నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క

కడగంటి చూపు పడనీయవేయిని

నీ కింకనుక సేవించుకుందురా

ఆనతినీయరా


రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష

నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక

పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా

ఆనతినీయరా హరా

సన్నుతిసేయగా సమ్మతినీయరా

Saturday, May 23, 2009

Okkadu - Ramunnaina Krushnunnaina

రాముణ్ణైన కృష్ణుణ్ణైన


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


రాముణ్ణైన కృష్ణుణ్ణైన కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడ స్థంబించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా!


చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం
భాగమతి ప్రేమ స్మృతికి బహుమతీభాగ్యనగరం
ఏ మాయ తంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెర
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర


పసిడి పతకాల హారం కాదురా విజయతీరం
ఆటనేమాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవర
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించర

Thursday, May 21, 2009

Kick - Gore Gore

గోరే గోరే


గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే

పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా

నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా

పోపోపొమ్మంటోందా నను రారా రమ్మంటోందా

నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా

చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా

ఉక్కిరి బిక్కిరి ఐపోతున్నా ఊపిరి ఆడక నీ వల్లా

ఇదరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుందా

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే

గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే


తెగ ఉరుముతు కలకాలం

తెరమరుగున తన భారం

మోసుకుంటు తిరగదు మేఘం

నీలా దాచుకోదుగా అనురాగం

ముల్లుగా నాటితే నీ వ్యవహారం తుళ్ళిపడదా నా సుకుమారం

మెల్లగ మీటితే నాలో మారం పలికుండేదే మమకారం

ఔనా ఐనా నన్నే అంటావే నేరం నాదా

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే


వెంటపడుతుంటే వెర్రి కోపం

నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం

మండిపడుతుందే హృదయం

మరిచే మద్యమైనా చెప్పదే సమయం

నీతోనీకే నిత్యం యుద్ధం ఎందుకు చెప్పవే సత్యభామా

ఏం సాధిస్తుందే నీ పంతం ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమా

తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా

గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే
గోరే గోరే గోగోరే గోరే గోరే గోగోరే గోగోరే


Kick - Atu Chudoddannana

అటు చూడొద్దన్నానా


అటు చూడొద్దన్నానా మాటాడొద్దన్నానా
ఒద్దొద్దు అంటే విన్నావంటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా
ఈ తలనొప్పేదైనా నీ తప్పేంలేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా
పడవలసిందేగా నువిలా నానా హింస

ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసి తెలియని పసి మనసా

మునుపేనాడూ ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాలా
వందలు వేలు ఉండుంటారు మతి చెడలేదే ఇలా వాళ్ళందరి వల్లా
ఎందుకివాళే ఇంత మంటెక్కిందో చెబుతావా
ఏం జరిగుంటుందంటే అడిగినవాళ్ళని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలెసావా
గుండెల గుమ్మందాటి వస్తుంటే చూస్తున్నావా

ఏ దారైనా ఏ వేళైనా ఎదురౌతుంటే నేరం తనదే
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం ఎందుకు ఎద లయ తప్పిందే
ఎక్కడ ఉందో లోపం నీతో వయసేంచెప్పిందే
అలకో ఉలుకో పాపం ఒప్పుకునేందుకు ఇబ్బందే
కనకే నాకీకోపం కన్నెగా పుట్టిన నామీదే