లలిత ప్రియ కమలం
లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిని
ఉదయ రవి కిరణం మెరిసినది ఊహల జగతిని
అమృత కలశముగ ప్రతి నిమిషం
కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదగు వరమిది
రేయి పవలు కలిపే సూత్రం సాంధ్యరాగం
కాదా నీలో నాలో పొంగే ప్రణయం
నేల నింగి కలిపే బంధం ఇంద్రఛాపం
కాదా మన స్నేహం ముడివేసే పరువం
కలల విరుల వనం మన హృదయం
వలచిన ఆమని కూరిమి మీరగ చేరిన తరుణం
కోటి తలపుల చివురులు తొడిగెను
తేటి స్వరముల మధువులు చిలికెను
తీపి పలుకుల చిలుకల కిలకిల
తీగ సొగసుల తొణికిన మిలమిల
పాడుతున్నది ఎద మురళి
రాగ ఝరి తరగల మృదురవళి
తూగుతున్నది మరులవని
లేత విరి కులుకుల నటనగని
వేల మధుమాసముల పూల దరహాసముల మనసులు మురిసెను
కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ
కాదా నీకై మ్రోగే ప్రాణం ప్రణవం
తీసే శ్వాసే ధూపం చూసే చూపే దీపం
కాదా మమకారం నీ పూజాకుసుమం
మనసు హిమగిరిగ మారినది
కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతికాగ
మేని మలుపుల చెలువపు గమనము
వీణ పలికిన జిలిబిలి గమకము
కాలి మువ్వగ నిలిచెను కాలము
పూల పవనము వేసెను తాళము
గేయమైనది తొలి ప్రాయం
వ్రాయమని మాయని మధుకావ్యం
స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి
Thanks for uploading the lyrics..
ReplyDeletethis is a wonderful song i love it
ReplyDeletethanq u a lot
ReplyDeletethanq for givng great lyrics
ReplyDeleteఇది నాకెంతో ఇష్టమైన పాట. సంగీతం, సాహిత్యం పోటీ పడి అలరిస్తాయి. సాహిత్యాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteela cheppanu varnincha nalavi khani ee anubuthi
ReplyDeletethanks for giving the lyric. It will be better if male and female bifurcation also given. however thanks once again for the trouble faced.
ReplyDeleteఈ పాట లిరిక్ ఇచ్చినందుకు చాల కృతజ్ఞతలు
ReplyDeletewat a lryics hats of to srivennala garu
ReplyDeletenaku e patante chala estam diny lyric e chinanduku krutagnathalu
ReplyDeleteధన్యవాదాలు,సాహిత్యం తెలుగులో రాసినందుకు మరియు అందించినదుకు. ఇలాంటి అద్బుతమయిన సాహిత్యం ఈరోజుల్లో సిరివెన్నల మాత్రమే రాయగలరు.
ReplyDeleteSuperb song and what a tone...mind blowing.
ReplyDeletethanks for the telugu lyrics. good luck
ReplyDelete5th & 4th lines from bottom have small correction... pl note it is 'GEYAMAINADI tholi prayam, RAYAMANI mayani madhukavyam'... rest all is fine.. thx for the lyrics
ReplyDeleteదయచేసి పాటలో ఒక చిన్న సవరణ గమనించగలరు.
ReplyDeleteరెండవ చరణంలో " హేయమైనది ' కాదు ' గేయమైనది" మరియు "మ్రాయమని కాదు "వ్రాయమని "
పాట పోస్ట్ చేసినందుకు ధన్యవాదములు
Thanks a lot for the lyrics!!
ReplyDelete