Monday, December 10, 2007

Gautam SSC - EdO ASa

ఏదో ఆశ


ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది

నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది

ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా


నీ లాలిని పాడే లాలన నేనోయ్

జాబిలికై ఆశ పడే బాలను నేను

తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్

చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్

సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ


నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా

క్షణానికో రూపంలో కనబడుతున్నా

జాడవై నావెంట నిను నడిపించాలోయ్

జానకై జన్మంతా జంటగా నడవాలోయ్

తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

Money - Chakravartiki

చక్రవర్తికీ


చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది మనీ మనీ

అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐనా అన్నీ అంది మనీ మనీ

పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ

పుట్టడానికి పాడెకట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ

కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ

తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ

డబ్బుని లబ్డబ్బని గుండెల్లో పెట్టుకోరా

దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా


ఇంటద్దె కట్టావ నా తండ్రి నో ఎంట్రీ విధి వాకిట్లో

దొంగల్లే దూరాలి సైలెట్లీ నీ ఇంట్లో చిమ్మచీకట్లో

అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ

అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ

రోటీ కప్డా రూము అన్నీ రూపీ రూపాలే

సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా

దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా


ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో పేద హీరోలా

డ్రీమించుకొవచ్చు ధీమాగా డ్రామాలో ప్రేమస్టోరీలా

పార్కులో కనే కలే ఖరీదైనది

బ్లాకులో కొనే వెలే సినీప్రేమది

చూపించరుగా ఫ్రీ షో వేసి ప్రేమికులెవ్వరికీ

జీవితం ప్రతినిమిషము సొమ్మిచ్చిపుచ్చుకొరా


డబ్బురా డబ్బుడబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

Sunday, December 9, 2007

Kanne manasu - yE divilo virisina

ఏ దివిలో విరిసిన


ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో

నా మదిలో నీవై నిండిపోయెనే

ఏ దివిలో విరిసిన పారిజాతమో

ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో


నీ రూపమే దివ్యదీపమై

నీ నవ్వులే నవ్యతారలై

నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే


పాలబుగ్గలను లేతసిగ్గులో పల్లవించగా రావే

నీలిముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే

కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే


నిదురమబ్బులను మెరుపుతీగవై కలలు రేపినది నీవే

బ్రతుకు వీణపై ప్రణయరాగములు ఆలపించినది నీవే

పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే


Listen to the song

Saptapadi - rEpalliya eda jhalluna

రేపల్లియ


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి


కాళింది మడుగున కాళీయుని పడగల

ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


అనగల రాగమై తొలుత వీనులలరించి

అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి

జీవనరాగమై బృందావన గీతమై

కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


వేణుగాన లోలుని మురుపించిన రవళి

నటనల సరళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మువ్వల మురళి

ఇదేనా ఆ మురళి


మధురా నగరిలో యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై

రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి


Listen to the song

Saptapadi - YE kulamu

ఏ కులము


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది

అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


ఆదినుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే మాటలు

ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


Listen to the song

Pelli Pustakam - SrIrastu Subhamastu

శ్రీరస్తు శుభమస్తు


శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం

శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు


తలమీదా చెయ్యివేసి ఒట్టుపెట్టినా

తాళిబొట్టు మెడనుకట్టి బొట్టుపెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

సన్నికల్లు తొక్కినా సప్తపదులు మెట్టినా

మనసు మనసు కలపడమే మంత్రం పరమార్ధం


శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


అడుగడున తొలిపలుకులు గుర్తుచేసుకో

తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో

ఒకరినొకరు తెలుసుకుని ఒడిదుడుకులు తట్టుకుని

మసకేయని పున్నమిలా మనికినింపుకో


శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు

శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం


Listen to the song

ApadbAndhavuDu - chukkallArA chUpullArA

చుక్కల్లారా చూపుల్లారా


చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి

మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి

వెళ్ళనివ్వరా వెన్నెలింటికి

విన్నవించరా వెండిమింటికి

జోజో లాలి జోజో లాలి

జోజో లాలి జోజో లాలి


మలిసంధ్య వేళాయే చలిగాలి వేణువాయే

నిదురమ్మా ఎటుబోతివే

మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే

కునుకమ్మా ఇటు చేరవే

నిదురమ్మా ఎటుబోతివే

కునుకమ్మా ఇటు చేరవే

గోధూళి వేళాయే గూళ్ళన్నీ కనులాయే

గువ్వల రెక్కలపైనా రివ్వూరివ్వున రావే

జోలపాడవా బేలకళ్ళకి

వెళ్ళనివ్వరా వెన్నెలింటికి

జోజో లాలి జోజో లాలి


పట్టుపరుపులేల పండువెన్నెలేల

అమ్మ ఒడి చాలదా బజ్జోవే తల్లి

పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే

అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే

నారదాదులేల నాదబ్రహ్మలేల

అమ్మ లాలి చాలదా బజ్జోవే తల్లి

నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే

అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే

చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల వెన్నెల్లో

తీయనైన కలలెన్నో ఊయలూగు వేళల్లో

అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు అంతులేడియ్యాల కోటితందనాల ఆ నందలాల

గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యాడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల

జాడచెప్పరా చిట్టితల్లికి

వెళ్ళనివ్వరా వెన్నెలింటికి

జోజో లాలి జోజో లాలి


చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి

మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి


Saturday, December 8, 2007

ApadbAndhavuDu - ourA ammakachellA

ఔరా అమ్మకచెల్ల


అమ్మలాలపైడి కొమ్మలాల ఏడి ఏవయ్యాడు జాడలేడియ్యాల కోటితందనాల ఆ నందలాల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల యేడనుంది ఆలనాటి నందనాల ఆనందలీల


ఔరా అమ్మకచెల్ల ఆలకించి నమ్మడమెల్లా

అంత వింత గాథల్లో ఆనందలాల

బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల

రేపల్లె వాడల్లో ఆనందలీలా

అయినవాడే అందరికి అయినా అందడు ఎవ్వరికీ

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


నల్లరాతి కండలతో కరుకైనవాడే

వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే

నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల

వెన్నముద్ద గుండెలతో కరుణించుతోడే ఆనందలీలా

ఆయుధాలు పట్టను అంటూ బావ బండి తోలిపెట్టే ఆ నందలాల

జాణజానపదాలతో ఙానగీతి పలుకునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


ఆలమందకాపరిలా కనిపించలేదా ఆ నందలాల

ఆలమందు కాలుడిలా అనిపించుకాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే కొండంత వేలు పట్టే ఆ నందలాల

తులసీదళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా గోపాలుడా లోకాలపాలుడా

తెలిసేది ఎలా ఎలా ఛాంగుభళా


Pournami - muvvalA navvakalA

మువ్వలా నవ్వకలా


మువ్వలా నవ్వకలా ముద్దమందారమా

ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా

నేలకే నాట్యం నేర్పావే నయగారమా

గాలికే సంకెళ్ళేశావే


నన్నిలా మార్చగల కళ నీ సొంతమా

ఇది నీ మాయ వల కాదని అనకుమా

ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే

రేయికే రంగులు పూశావే


కలిసిన పరిచయం ఒకరోజే కదా

కలిగిన పరవశం యుగముల నాటిదా

కళ్ళతో చుసే నిజం నిజం కాదేమో

గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో


నన్నిలా మార్చగల కళ నీ సొంతమా

ఇది నీ మాయ వల కాదని అనకుమా

నేలకే నాట్యం నేర్పావే నయగారమా

గాలికే సంకెళ్ళేశావే


పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ

మరియొక జన్మగా మొదలౌతున్నదా

పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా

మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా


మువ్వలా నవ్వకలా ముద్దమందారమా

ముగ్గులో దించకిలా ముగ్ధసింగారమా

ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమే

రేయికే రంగులు పూశావే


Annamayya - telugu padAniki

తెలుగు పదానికి


తెలుగు పదానికి జన్మదినం

ఇది జానపదానికి ఙానపదం

ఏడు స్వరాలే ఏడుకొండలై

వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం


అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము

బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది

శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై

దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి

నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి

శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని

తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము

నందనానందకారకము


పద్మావతియే పురుడుపోయగా

పద్మాసనుడే ఉసురుపోయగా

విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై

అవతరించెను అన్నమయ

అసతోమా సద్గమయా


పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా

హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా

తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ

తమసోమా జ్యోతిర్గమయా

Godavari - uppongelE gOdAvari

ఉప్పొంగెలే గోదావరి


షడ్యమాం భవతి వేదం

పంచమాం భవతి నాదం

శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి

వేదమంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి

రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం

ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం

ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ

నది ఊరేగింపులో పడవ మీద లాగా

ప్రభువు తాను కాగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు

లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు

చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి

సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి

లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు

అల పాపికొండల నలుపు కడగలేక

నవ్వు తనకు రాగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి

వేదమంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి

రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


Godavari - RAma chakkani sItaki

రామచక్కని సీతకి


నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ

మధుర వదన నలిన నయన మనవి వినరా రామా


రామచక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట

రామచక్కని సీతకి


ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో

రామచక్కని సీతకి


ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే

నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు

రామచక్కని సీతకి


చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే

చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామచక్కని సీతకి


ఇందువదన కుందరదన మందగమన భామ

ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

Thursday, November 29, 2007

amRtaM - ayyOlu ammOlu

అమృతం -- అయ్యోలు అమ్మోలు


అయ్యోలు అమ్మోలు ఇంతేనా బ్రతుకు హు హు హు

ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హ హ హ

మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు

ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రాంలు

వార్తల్లో హెడ్లైన్సా మనకొచ్చే చిలిపి కష్టాలు

అయోడిన్ తో ఐపోయే గాయాలే మనకు గండాలు


ఎటో వెళ్ళిపోకు నిను చూసింది అనుకోవ చెవులు

హలో హౌ డు యు డు అని అంటోంది అంతే నీ లెవెలు

ఆతిథ్యం ఇస్తానంటే మాత్రం వస్తుందా

తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా

గాలైనా రాదయ్య నీదసలే ఇరుకు అద్దిల్లు

కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెనుతుఫానసలు


ఒరే ఆంజినేయులు తెగ ఆయాస పడిపోకు చాలు

మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు

కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు

కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు

నైటంతా దోమల్తో ఫైటింగే మనకి గ్లోబల్ వార్

హాబీగా ఫీలయ్యే టెన్షన్లేం పడకు గోలీమార్

Wednesday, November 28, 2007

Khadgam - nuvvu nuvvu

నువ్వు నువ్వు


నువ్వు నువ్వు నువ్వే నువ్వు

నువ్వు నువ్వు నువ్వు

నాలోనే నువ్వు

నాతోనే నువ్వు

నా చుట్టూ నువ్వు

నేనంతా నువ్వు

నా పెదవిపైన నువ్వు

నా మెడ వంపున నువ్వు

నా గుండె మీద నువ్వు

ఒళ్ళంతా నువ్వు

బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు

ముద్దేసే నువ్వు

నిద్దర్లో నువ్వు పొద్దుల్లో నువ్వు

ప్రతి నిమిషం నువ్వు


నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు

నా మనసుని లాలించే చల్లదనం నువ్వు

పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు

బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు

నా ప్రతి యుద్ధం నువ్వు

నా సైన్యం నువ్వు

నా ప్రియ శతృవు నువ్వు

మెత్తని ముల్లై గిల్లే తొలి చినుకే నువ్వు

నచ్చే కష్టం నువ్వు


నా సిగ్గుని దాచుకునే కౌగిలివే నువ్వు

నావన్నీ దోచుకునే కోరికవే నువ్వు

మునిపంటితొ నను గిచ్చే నేరానివి నువ్వు

నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు

తీరని దాహం నువ్వు నా మోహం నువ్వు

తప్పని స్నేహం నువ్వు నువ్వు

తీయని గాయం చేసే అన్యాయం నువ్వు

అయినా ఇష్టం నువ్వు నువ్వు


మైమరపిస్తూ నువ్వు

మురిపిస్తుంటే నువ్వు

నే కోరుకునే నా మరో జన్మ నువ్వు

కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు

నాకేతెలియని నా కొత్త పేరు నువ్వు

నా అందం నువ్వు ఆనందం నువ్వు

నేనంటే నువ్వు

నా పంతం నువ్వు నా సొంతం నువ్వు

నా అంతం నువ్వు

Tuesday, November 27, 2007

Happy - Nee KOsaM

నీ కోసం


నీ కోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని

చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని


నీ కోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ


దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా

దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా

కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా


నీ కోసం ఒక మధుమాసం


పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా

ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా

కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా

Saturday, November 24, 2007

Drohi - nI talapuna

నీ తలపున


నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే

నీ రెప్పలే కనురెప్పలే కంటిపాపగ దాచెను హాయే

నాలో రగిలే తీయని మంట నేడెందుకని

కోరికలన్నీ తారకలాయే ఏ విందుకని


ఒడిలో రేగు విరహం అది కోరెనే చిలిపి సరసం

తగని వలపు మోహం అది తగవే తీరు స్నేహం

తరగనిది కరగనిది వగలన్ని సెగలైన చలి

తొలి ముద్దు నన్నే ఒలిపించగానే దినం దినం నిన్నే చూడగ


బుగ్గలా పాల మెరుపు అది తగ్గలేదింక వరకు

మోహం రేపు కలగా తొలి ఆమనే వచ్చె నాకై

రసికతలో కసి కథలే తెలిపెను చిలిపిగ చెలి

ముద్దు ముత్యాలన్ని మోవి దిద్దగానే ఎగిసెను నాలో ప్రాయమే

Monday, October 8, 2007

Atidhi - satyaM EmiTO

సత్యం ఏమిటో


సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా

రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా

నిను నీవే సరిగా కనలేవే మనసా

నడిరాతిరి నడక కడతేరదు తెలుసా

ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా

ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా


చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని

నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి

జాబిలిని వెలి వేస్తామా తనతో చెలిమే విడిచి

రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా

ప్రాణం ఉనికిపైన అనుమానపడరు ఎపుడైనా

నిను నీవే సరిగా కనలేవే మనసా

నడిరాతిరి నడక కడతేరదు తెలుసా


పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా

సంద్రంలో ఎగసే అలకి అలజడి నిలచేదెపుడో

సందేహం కలిగే మదికి కలతలు తీర్చేదెవరో

శాపంలాగ వెంటపడుతున్న గతం ఏదైనా

దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా

Atidhi - khabaDdArani

ఖబడ్దారని


ఖబడ్దారని కబురు పెట్టరా

గుబులు పుట్టదా చెడు గుండెలో

నిదర దారిని తగలబెట్టరా

పగలు పుట్టదా నడి రాత్రిలో

పిరికిగ పరుగు తీస్తావా

పొగరుగ పోరు చేస్తావా

కలుగున నక్కి ఉంటావా

ఎవరికీ చిక్కనంటావా

చెడునే తరుముతుంటే ఎక్కడున్నా కంటపడవా

ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం


నీ పేరే సమరశంఖమై వినిపించనీ విద్రోహికి

ఆయువు తోడేసే యముడి పాశమే అనిపించనీ అపరాధికి

పిడికిలి ఎత్తి శాసించు

పిడుగుని పట్టి బంధించు

యుద్ధం తప్పదంతే బ్రతుకు పద్మవ్యూహమైతే

ఖతం ఖతం ఖేల్ ఖతం ఖతం

Friday, October 5, 2007

Preminchu - tolisAri ninu cUsi

తొలిసారి నిను చూసి


తొలిసారి నిను చూసి ప్రేమించినా

బదులిచ్చినావమ్మ ప్రియురాలిగా

తొలిసారి నిను తాకి ప్రేమించినా

మనసిచ్చినానమ్మ ప్రియ నేస్తమా

కలలోనూ ఇలా కలిసుండాలని

విడిపోని వరమీయవా అన్నది ప్రేమ


తూగే నా పాదం నువ్వే నడిపిస్తుంటే

సాగింది పూబాట నీవుగా

ఊగే నీ ప్రాయం నా వేలే శృతి చేస్తుంటే

మోగింది వయ్యారి వీణగా

ముద్దుల ఊసులు మబ్బుల గీతికి తీసుకు వెళ్ళాలి

ముచ్చట చూసిన అల్లరి గాలులు పల్లకి తేవాలి

అనుబంధానికి ప్రతిరూపం అని

మన పేరే ప్రతి వారికి చెబుతోంది ప్రేమ


నిన్నే నాకోసం పంపిచాడేమో బ్రహ్మ

నడిచేటి నా ఇంటి దీపమా

నీతో సావాసం పండించింది నా జన్మ

నూరేళ్ళ నా నుసట కుంకుమ

పచ్చని శ్వాసల యవ్వన గీతికి పల్లవి నువ్వంట

పచ్చని ఆశల పూ పులకింతకి పందిరి నీవంట

మన బిడి కౌగిలి తన కోవెల అని

కొలువుండి పోవాలని చేరింది ప్రేమ

Preminchu - kaMTEnE amma ani aMTE elA

కంటేనే అమ్మ అని అంటే ఎలా


కంటేనే అమ్మ అని అంటే ఎలా

కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా

కంటేనే అమ్మ అని అంటే ఎలా

కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా


కణకణలాడే ఎండకు శిరసు మాడినా

మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ

చారేడు నీళ్ళైన తాను దాచుకోక

జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ

ఆ అమ్మలనే మించిన మా అమ్మకు

ఋణం తీర్చుకోలేను ఏ జన్మకు


ఎన్నో అంతస్తులుగా ఎదిగిపోయినా

మేడకున్న అసలు ఉనికి ఆ పునాది పైనే

సిరుల ఝల్లులో నిత్యం పరవసించినా

మగువ జీవన సాఫల్యం మాతృత్వంలోనే

ప్రతి తల్లికి మమకారం పరమార్ధం

మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం


కరుణించే ప్రతి దేవత అమ్మే కదా

కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా

Tuesday, October 2, 2007

Happy Days - Oh my friend

Oh my friend


పాదమెటు పోతున్నా పయనమెందాకైనా

అడుగు తడబడుతున్నా తోడురానా

చిన్ని ఎడబాటైనా కంటతడి పెడుతున్నా

గుండె ప్రతి లయలోన నేను లేనా

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడవేనా

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది

జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది

మీరు మీరు నించి మన స్నేహగీతం ఏరా ఏరాల్లోకి మారే

మోమటాలే లేని కళే జాలువారే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీవే

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


వానవస్తే కాగితాలే పడవలయ్యే ఙాపకాలే

నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే

గిల్లికజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూతుళ్ళింతల్లో తేలే స్నేహం

మొదలు తుదలు తెలిపే ముడే వీడకుందే

ఒంటరైనా ఓటమైనా

వెంటనడిచే నీడనీదే

Oh my friend...తడి కన్నులనే తుడిచిన నేస్తమా

Oh my friend...ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా


Tuesday, September 25, 2007

Gayam - niggadIsi aDugu

నిగ్గదీసి అడుగు


నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని

అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని

మారదు లోకం మారదు కాలం

దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ

మారదు లోకం మారదు కాలం


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి

గొర్రెదాటు మందకి నీ ఙానబోధ దేనికి

ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం

ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామబాణమార్పిందా రావణ కాష్టం

కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం


పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా

అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా

వేట అదే వేటు అదే నాటి కథే అంతా

నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా

బలవంతులె బ్రతకాలనే సూక్తి మరవకుండ

శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

Gayam - alupannadi uMdA

అలుపన్నది ఉందా


అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు

అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు

మెలికలు తిరిగే నది నడకలకు

మరి మరి ఉరికే మది తలపులకు


నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు

నాసేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు

ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు

కలలను తేవా నా కన్నులకు


నీచూపులే తడిపే వరకు ఏమైనదో నా వయసు

నీఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు

ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు

ఎదురుగా నడిచే తొలి ఆశలకు

Tuesday, September 18, 2007

Ravoyi Chandamama - swapna vENuvEdO

స్వప్న వేణువేదో


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

జోడైన రెండు గుండెల ఏక తాళమో

జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో

లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు


నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం

ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం

కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన

కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా


నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో

మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం

పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం

వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

Ninne Pelladata - eTO veLLipOyiMdi

ఎటో వెళ్ళిపోయింది


ఎటో వెళ్ళిపోయింది మనసు

ఇలా వంటరయ్యింది వయసు

ఓ చల్ల గాలి ఆచూకి తీసి కబురీయలేవా ఏమయిందో


ఏ స్నేహమో కావాలని ఇన్నాళ్ళుగా తెలియలేదు

ఇచ్చెందుకే మనసుందని నాకెవ్వరూ చెప్పలేదు

చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో


ఎటో వెళ్ళిపోయింది మనసు


కలలన్నవే కొలువుండనీ కనులుండి ఏం లాభమంది

ఏ కదలిక కనిపించని శిలలాంటి బ్రతుకెందుకంది

తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకౌతుంది అంటూ


ఎటో వెళ్ళిపోయింది మనసు

Ninne Pelladata - kannullO nI rUpamE

కన్నుల్లో నీ రూపమే


కన్నుల్లో నీ రూపమే

గుండెల్లో నీ ధ్యానమే

నా ఆశ నీ స్నేహమే

నా శ్వాస నీ కోసమే

ఆ ఊసుని తెలిపేందుకు

నా భాష ఈ మౌనమే


మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా

నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా

గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం


అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని

తల వంచుకుని నేను తెగ ఎదురుచూసాను నీ తెగువ చూడాలని

చూస్తూనే వేలంత తెలవారి పోతుందో ఏమో ఎలా ఆపడం

Monday, September 17, 2007

Nuvvu Leka Nenu Lenu - EdO EdO

ఏదో ఏదో


ఏదో ఏదో అయిపోతుంది

ఎదలో ఏదో మొదలయ్యింది

నిన్నే చూడాలని నీతో ఉండాలని

నేనే ఓడాలని నువ్వే గెలవాలని

పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన


కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే

మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే

కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే

చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే

వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక

తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక

నిన్నే తాకాలని నీతో గడపాలని

ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని

మనసేమో మనసిచ్చింది

వయసేమో చనువిచ్చింది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన


ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే

మోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటే

ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే

ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే

ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక

ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక

నువ్వే కావాలని నిన్నే కలవాలని

మనసే విప్పాలని మాటే చెప్పాలని

ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

Nuvve Nuvve - cheliyA nI vaipE vastunnA

చెలియా నీవైపే వస్తున్నా


చెలియా నీవైపే వస్తున్నా

కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా

నిద్దర పోతున్న రాతిరినడిగా

గూటికి చేరిన గువ్వలనడిగా

చల్లగాలినడిగా ఆ చందమామనడిగా

ప్రియురాలి జాడ చెప్పరేమని

అందరినీ ఇలా వెంట పడి అడగాలా

సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా


అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం

అరెరే పాపమని జాలిగా చూసే జనం

గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా

నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా


నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని

ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని

కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని

పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే

Nuvve Nuvve - nA manasukEmayiMdi

నా మనసుకేమయింది


నా మనసుకేమయింది నీ మాయలో పడింది

నిజమా కలా తెలిసేదెలా

నాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుంది

దాచేదెలా లోలోపల

మన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుంది

అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది


చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ

కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమా

జంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామ

అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ

పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి

పెంచుకున్న మత్తులో పడి మతే చెడి

గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని


ఎప్పుడూ గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరు లాగ

ఎప్పుడో అప్పుడప్పుడు గుర్తుకొస్తొంది నా పేరు కొద్దిగ

ఒంటిగా ఉండనివ్వదు కళ్ళలో ఉన్న నీ రూపురేఖ

ఇంతగా నన్ను ఎవ్వరూ కమ్ముకోలేదు నీలా ఇలాగ

లోకమంటె ఇద్దరే అదే మనం అని

స్వర్గమంటె ఇక్కడే అంటే సరే అని

వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని