సత్యం ఏమిటో
సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా
రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా
ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా
చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని
నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి
జాబిలిని వెలి వేస్తామా తనతో చెలిమే విడిచి
రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా
ప్రాణం ఉనికిపైన అనుమానపడరు ఎపుడైనా
నిను నీవే సరిగా కనలేవే మనసా
నడిరాతిరి నడక కడతేరదు తెలుసా
పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా
సంద్రంలో ఎగసే అలకి అలజడి నిలచేదెపుడో
సందేహం కలిగే మదికి కలతలు తీర్చేదెవరో
శాపంలాగ వెంటపడుతున్న గతం ఏదైనా
దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా
manchi songs post chestunnaaru :)
ReplyDeletegood job !
ఏమి.. ఈ భాగ్యమో నెస్తమా... అని పాడాలని ఉంది మీ బ్లాగ్ చూసాక. ఆహా ఎన్నాళ్లకెన్నాలకు ఇంత మంచి భ్లాగ్ చూసా.అబ్బొ ఎన్ని పాటలో అదీ తెలుగులో.
ReplyDeleteKeep Going and please try to add this in www.koodali.org (or) telugubloggers.com like some sites. so that any telugu bloggers can visit this blog. please dont stop this good job :)
Best of luck to you people.
hi ,
ReplyDeletei suggested ur site at saradaga.com.