Sunday, March 29, 2009

Sasirekha Parinayam - Edo Oppukonandi

ఏదో ఒప్పుకోనంది


ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం

అది ఏదో చెప్పనంటోంది నా మౌనం

ఉబికి వస్తుంటే సంతోషం

అదిమి పెడుతోంది ఉక్రోషం

తన వెనుక నేనో నా వెనుక తానో

ఎంత వరకీ గాలి పయనం

అడగదే ఉరికే ఈ వేగం


ముల్లులా బుగ్గను చిదిమిందా

మెల్లగా సిగ్గును కదిపిందా

వానలా మనసును తడిపిందా

వేలలా తనువును తడిమిందా

చిలిపి కబురు ఏం విందో

వయసుకేమి తెలిసిందో

ఆదమరుపో ఆటవిడుపో

కొద్దిగా నిలబడి చూద్దాం ఓ క్షణం అంటే కుదరదంటోంది నా ప్రాణం

వలదంటే ఎదురుతిరిగింది నా హృదయం

Sasirekha Parinayam - Ila Entasepu

ఇలా ఎంత సేపు


ఇలా ఎంత సేపు నిన్ను చూసినా

సరే, చాలు అనదు కంటి కామన

ఎదో గుండెలోని కొంటె భావన

అలా ఉండిపోక పైకి తేలునా

కనులను ముంచిన కాంతివొ

కలలను పెంచిన భ్రాంతివొ

కలవనిపించిన కాంతవొ

మతి మరపించిన మాయవొ

మది మురిరిపించిన హాయివొ

నిదురని తుంచిన రేయివొ


శుభలేఖలా నీకళ స్వాగతిస్తోందొ

శశిరేఖలా సొగసెటో లాగుతూ ఉందో

తీగలా అల్లగా చేరుకోనుందో

జింకలా అందక జారిపోనుందో

మనసున పూచిన కోరిక

పెదవుల అంచును దాటక

అదుముతు ఉంచకే అంతగ

అనుమతినివ్వని ఆంక్షగ

నిలబడనివ్వని కాంక్షగ

తికమక పెట్టక ఇంతగ


మగపుట్టుకే చేరని మొగలి జడలోన

మరుజన్మగా మారని మగువు మెడలోన

దీపమై వెలగనీ తరుణి తిలకాన

పాపనై ఒదగనీ పడతి ఒడిలోన

నా తలపులు తన పసుపుగ

నా వలపులు పారాణిగ

నడిపించిన పూదారిగ

ప్రణయము విలువే కొత్తగ

పెనిమిటి వరసే కట్టగ

బ్రతకన నేనే తానుగ

Sunday, March 8, 2009

Ela Cheppanu - Ee Kshanam

ఈ క్షణం


ఈ క్షణం ఒకే ఒక కోరిక

నీ స్వరం వినాలని తీయగ

కరగని దూరములో

తెలియని దారులలో

ఎక్కడున్నావు అంటోంది ఆశగా


ఎన్ని వేల నిమిషాలో లెక్కపెట్టుకుంటోంది

ఎంత సేపు గడపాలో చెప్పవేమి అంటోంది

నిన్నే నీవు వెళ్ళావన్న సంగతి గుర్తేలేని గుండె ఇది

మళ్ళి నిన్ను చూసేదాక నాలో నన్ను ఉండనీక ఆరాటంగ కొట్టుకున్నది


రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది

రేపు నువ్వు రాగానే కాస్త నచ్చజెప్పు మరి

నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళి మళ్ళి తలచుకుని

ఇంకా ఎన్నో ఉన్నాయంటు ఇప్పుడే చెప్పాలంటు నిద్దరోను అంటోంది