Saturday, October 4, 2008

Kotha Bangaru Lokam - Okay Anesa

ఓకే అనేశా


ఓకే అనేశా

దేఖో నా భరోసా

నీకే వదిలేశా

నాకెందుకులే రభస

భారమంతా నేను మోస్తా

అల్లుకో ఆశాలత

చేరదీస్తా సేవ చేస్తా

రాణిలా చూస్తా

అందుకేగా గుండెలో నీ పేరు రాశా

తెలివనుకో తెగువనుకో మగ జన్మ కదా

కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


పరిగెడదాం పదవే చెలీ

ఎందాక అన్నానా

కనిపెడదాం తుది మజిలి

ఎక్కడున్నాం

ఎగిరెళదాం ఇలనొదిలి

నిన్నాగమన్నానా

గెలవగలం గగనాన్ని

ఎవరాపినా

మరోసారి అను ఆ మాట

మహారాజునైపోతాగా

ప్రతి నిమిషం నీ కోసం

ప్రాణం సైతం పందెం వేసేస్తా

పాత ఋణమో కొత్త వరమో

జన్మ ముడి వేసిందిలా

చిలిపితనమో చెలిమి గుణమో

ఏమిటీ లీలా

స్వప్నలోకం ఏలుకుందాం రాగమాలా

అదిగదిగో మదికెదురై కనబడలేదా

కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా


పిలిచినదా చిలిపి కల

వింటూనే వచ్చేశా

తరిమినదా చెలియనిలా

పరుగుతీశా

వదిలినదా బిడియమిలా

ప్రశ్నల్ని చెరిపేశా

ఎదురవదా చిక్కు వల

ఏటో చూశా

భలేగుందిలే నీ ధీమా

ఫలిస్తుందిలే ఈ ప్రేమ

అదరకుమా బెదరకుమా

పరదా విడిరా సరదా పడదామా

పక్కనుంటే ఫక్కుమంటూ నవ్వినాడా ప్రియతమా

చిక్కులుంటే బిక్కుమంటూ లెక్క చేస్తామా

చుక్కలన్నీ చిన్నబోవా చక్కనమ్మా

మమతనుకో మగతనుకో మతి చెడిపోదా

కథ మొదలనుకో తుది వరకు నిలబడగలదా

Kotha Bangaru Lokam - Nenani Neevani

నేనని నీవని


నేనని నీవని వేరుగా లేమని

చెప్పినా వినరా ఒకరైనా

నేను నీ నీడనీ నువ్వు నా నిజమనీ

ఒప్పుకోగలరా ఎపుడైనా

రెప్ప వెనకాల స్వప్నం

ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే

అడ్డుకోగలదా వేగం

కొత్త బంగారు లోకం పిలిస్తే


మొదటి సారి మదిని చేరి

నిదర లేపిన ఉదయమా

వయసులోని పసితనాన్ని

పలకరించిన ప్రణయమా

మరీ కొత్తగా మరో పుట్టుక

అనేటట్టుగా ఇది నీ మాయేనా


పథము నాది పరుగు నీది

రథము వేయరా ప్రియతమా

తగువు నాది తెగువ నీది

గెలుచుకో పురుషోత్తమా

నువ్వే దారిగా నేనే చేరగా

ఎటూ చూడక వెనువెంటే రానా