Thursday, March 13, 2008

Gamyam - Entavaraku Endukoraku

ఎంతవరకు ఎందుకొరకు


ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు

గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు

ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా


కనపడేవెన్నెన్ని కెరటాలు

కలగలిపి సముద్రమంటారు

అడగరేం ఒక్కొక్క అల పేరు

మనకిలా ఎదురైన ప్రతివారు

మనిషనే సంద్రాన కెరటాలు

పలకరే మనిషీ అంటే ఎవరూ

సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది

చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది

నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా

మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా

తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా


మనసులో నీవైన భావాలే

బయట కనిపిస్తాయి దృశ్యాలై

నీడలు నిజాల సాక్ష్యాలే

శత్రువులు నీలోని లోపాలే

స్నేహితులు నీకున్న ఇష్టాలే

ఋతువులు నీ భావ చిత్రాలే

ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం

మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండూ నీకవి సొంతం కావు పోనీ

జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానియ్యి

Gamyam - Challegani

చాల్లేగాని


చాల్లేగాని ఏంటా పరాకు

ఉన్నట్టుండి ఏమైంది నీకు

అయ్యో అని worryఐపోకు

tell me అని enquiryలన్ని ఎందుకు

మాతోనే నువ్వుంటూ మా ఊసే పట్టనట్టు

ఏదోలా ఎందుకుంటావ్ నీదీలోకం కాదన్నట్టు

ఒదిగుందే లోని గుట్టు

కదిలిస్తే తేనె పట్టు

వదలదుగా వెంటపడుతు

నాకేం తెలుసిది ఇంతేనంటు

మునిగేదాక లోతన్నది

కొలిచే వీలు ఏమున్నది

పరవాలేదు అంటున్నది

ప్రేమలో పడ్డది


ఆమె చెంపలా కందిపోవడం

ఏమి చెప్పడం ఎంత అద్భుతం

అందుకే కదా కోరి కోరి కయ్యాలు

అతని కోసమే ఎదురుచూడటం

బ్రతిమలాడి తను అలక తీర్చడం

పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు

జంటలెన్ని చెబుతున్నా

ఎన్ని కథలు వింటున్నా

అంతుబట్టదే ప్రేమ ఏనాటికైనా

విన్నాగాని అంటావేగాని

ఏమంటోంది ఆకాశవాణి

చూసాగాని వేరే లోకాన్ని

ఏంచెప్పాలి చూపించే వీలులేదని


పక్కకెళ్ళిపో పాడు మౌనమా

కరగవెందుకే కొద్ది దూరమా

బయటపడని జత ఏదో చూసుకోరాదా

ఎంతసేపు ఈ వింత dilemma

కథని కాస్త కదిలించు కాలమా

to be not to be debate ఎంతకీ తెగదా

కొత్త దారిలో నడక

ఇప్పుడిప్పుడే గనక

తప్పదేమో తడబడక

అలవాటు లేక


ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను

నువ్వొచ్చాక ఏమైపోయాను

నీతో ఇలా అడుగేస్తున్నాను

ఏవైపంటే ఏమో ఎలాగ చెప్పను

Wednesday, March 12, 2008

Gamyam - Samayama Chalinchake

సమయమా చలించకే


సమయమా చలించకే బిడియమా తలొంచకే

తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో


సమయమా చలించకే బిడియమా తలొంచకే


చంటి పాపలా అనుకుంటూ ఉండగానే

చందమామలా కనుగొన్నా గుండెలోనే

తనలో చిలిపితనం సిరివెన్నెలే అయ్యేలా

ఇదిగో కలల వనం అని చూపుతున్న లీలలో


సమయమా చలించకే బిడియమా తలొంచకే


పైడి బొమ్మలా నను చూసే కళ్ళలోనే

ఆడ జన్మలా నను గుర్తించాను నేనే

తనకే తెలియదని నడకంటే నేర్పుతూనే

నను నీ వెంటే రానీ అని వేడుతున్న వేళలో


సమయమా చలించకే బిడియమా తలొంచకే