Tuesday, September 18, 2007

Ravoyi Chandamama - swapna vENuvEdO

స్వప్న వేణువేదో


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

జోడైన రెండు గుండెల ఏక తాళమో

జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో

లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు


నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం

ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం

కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన

కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా


నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో

మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం

పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం

వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

3 comments:

  1. చందమామ సినిమా లోని "నాలో ఆశలకు" సాహిత్యం కూడా త్వరలో పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. Replies
    1. Loved this song thank you so much for posting this song

      Delete