Sunday, September 16, 2007

Nuvvostanante Nenoddantana - chaMdrullO uMDE kuMdElu

చంద్రుళ్ళో ఉండే కుందేలు


చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా

కిందికొచ్చి నీలా మారిందా

చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా

నిన్ను మెచ్చి నీలో చేరిందా

నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట

నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా


గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో

నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో


కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా

పాపలాంటి లేత పదం పాఠశాలగా

కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా

జావళీల జాణతనం బాటచూపగా

కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా

అంతటా ఎన్నో వర్ణాలు

మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా

ఇంతలా ఏవో రాగాలు


ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా

సాగుతున్న ఈ పయనం ఎంత వరకో

రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా

రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో

మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే

లెక్కలే మాయం అయిపోవా

రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే

దిక్కులే తత్తర పడిపోవా

No comments:

Post a Comment