Monday, September 3, 2007

Manasanta Nuvve - evvarineppuDu

ఎవ్వరినెప్పుడు


ఎవ్వరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ

ఏ మదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ

అర్థంకాని పుస్తకమే ఐనాగని ఈ ప్రేమ

జీవిత పరమార్థంతానే అనిపిస్తుందీ ఈ ప్రేమ


ఎన్నెన్నెనో రంగులతో కనిపిస్తుందీ ఈ ప్రేమ

రంగులకలలే కాంతి అనీ నమ్మిస్తుందీ ఈ ప్రేమ

వర్ణాలన్నీ కలిసుండే రవికిరణం కాదీప్రేమ

తెల్లని సత్యం కల్ల అనీ ప్రకటిస్తుందీ ఈ ప్రేమ


లైలామజ్ను గాథలని చదివిస్తుందీ ఈ ప్రేమ

తాజ్ మహల్ తన కోట అనీ చూపిస్తుందీ ఈ ప్రేమ

కలవని జంటల మంటలలో కనిపిస్తుందీ ఈ ప్రేమ

కలిసిన వెంటనె ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ


అమృత కలశం తానంటూ ఊరిస్తుందీ ఈ ప్రేమ

జరిగే మథనం ఎంతటిదో ముందుగ తెలపదు ఈ ప్రేమ

ఔనంటూ కాదంటూనే మదిని మథించే ఈ ప్రేమ

హాలాహలమే గెలవండీ చూద్దామంటుందీప్రేమ


ఇంతకుముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ

ప్రతి ఓక జంటతో మీ గాథే మొదలంటుంది ఈ ప్రేమ

సీతారాములనేమార్చే మాయలేడి కద ఈ ప్రేమ

ఓటమినే గెలుపనిపించే మాయాజూదం ఈ ప్రేమ

No comments:

Post a Comment