Wednesday, September 5, 2007

Manmadhudu - nEnu nEnugA lEnE

నేను నేనుగా లేనే


నేను నేనుగా లేనే నిన్న మొన్నలా

లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు

అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు

తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు

ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు

నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన

మీకెవరికి కనిపించదు ఏమైనా


చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా

అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే

తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా

చెప్పలేని నిజమేదో నాకూ వింతే

కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో

చెప్పవ కనురెప్పలకే మాటొస్తే

4 comments:

  1. Awesome song and lyrics...thanks you for posting actual lyrics.

    ReplyDelete
  2. కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
    చెప్పవ కనురెప్పలకే మాటొస్తే wow awesome lyrics 😍😍😍😍😍😍😍😍😍

    ReplyDelete