Thursday, September 6, 2007

Chakram - jagamaMta kuTumbaM

జగమంత కుటుంబం


జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది


కవినై కవితనై భార్యనై భర్తనై

కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో

మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల

నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ

వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని

రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లని


మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మింటికి కంటిని నేనై

కంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై

వెన్నెల పూతల మంటను నేనై

రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ

వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల

చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని


గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె

గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హృదయమే నా లోగిలి

నా హృదయమే నా పాటకి తల్లి

నా హృదయమే నాకు ఆలి

నా హృదయములో ఇది సినీవాలి

No comments:

Post a Comment