చిట్టి నడుము
చిట్టి నడుమునే చూస్తున్నా చిత్రహింసతో ఛస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా
చుట్టుపకలేమౌతున్నా గుర్తుపట్టనేలేకున్నా
చెవినపడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణ
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగి చూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పుచేసైనా
నంగనాచిలా నడుమూపి
నల్ల తాచులా జడ చూపి
తాకి చూస్తె కాటేస్తానంది
చీమలాగ తెగ కుడుతుంది
పాములాగ పగ పడుతుంది
కళ్ళుమూసినా ఎదరే ఉంది
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగా కందిందిలా నడుమొంపుల్లో నలిగి
ఈ తికమక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి
ఎన్ని తిట్టినా వింటానే
కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారి
ఉరిమి చూసినా ఓకేనే
ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హైరే హైరే ఏ ప్రాణహాని రానీ
హైరె హైరె ఇక ఏమైనా కానీ
నిను నిమరకా నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగా మరుజన్మ ఎందుకే రాణి
No comments:
Post a Comment