Friday, February 5, 2016

Kanche - Itu Itu Itu Ani

 ఇటు ఇటు ఇటు అని


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో...ఏమో

సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారయ్యిందో సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా
తనోటిఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్నా మెళకువలో ఉన్నాం కదా
మన దరికెవరు వస్తారు కదిలించంగ
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటు పోతుందో
నిదుర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే
మనం అనే కథానిక మొదలైందో


పెదాల మీదుగ అదేమి గల గల పదాల మాదిరిగ
సుధాల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కద
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగ
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ
వినబోతున్న సన్నాయి మేళాలుగ
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

No comments:

Post a Comment