Showing posts with label Singer - Usha. Show all posts
Showing posts with label Singer - Usha. Show all posts

Monday, October 8, 2007

Atidhi - satyaM EmiTO

సత్యం ఏమిటో


సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా

రెప్పల దుప్పటి కప్పే చీకటి చూపించేనా ఏ కాంతినైనా

నిను నీవే సరిగా కనలేవే మనసా

నడిరాతిరి నడక కడతేరదు తెలుసా

ఏవో ఙాపకాల సుడి దాటి బయటపడలేవా

ఎన్నో తీపి సంగతుల రేపు పిలుపు వినలేవా


చంద్రుడి ఎదలో మంటని వెన్నెల అనుకుంటారని

నిజమైనా నమ్మేస్తామా భ్రమలో పడమా తెలిసి

జాబిలిని వెలి వేస్తామా తనతో చెలిమే విడిచి

రూపం లేదు గనక సాక్ష్యాలు అడిగి ఎవరైనా

ప్రాణం ఉనికిపైన అనుమానపడరు ఎపుడైనా

నిను నీవే సరిగా కనలేవే మనసా

నడిరాతిరి నడక కడతేరదు తెలుసా


పోయింది వెతికే వేదన పొందింది ఏదో పోల్చునా

సంద్రంలో ఎగసే అలకి అలజడి నిలచేదెపుడో

సందేహం కలిగే మదికి కలతలు తీర్చేదెవరో

శాపంలాగ వెంటపడుతున్న గతం ఏదైనా

దీపంలాగ తగిన దారేదో చూపగలిగేనా

Monday, September 17, 2007

Nuvvu Leka Nenu Lenu - EdO EdO

ఏదో ఏదో


ఏదో ఏదో అయిపోతుంది

ఎదలో ఏదో మొదలయ్యింది

నిన్నే చూడాలని నీతో ఉండాలని

నేనే ఓడాలని నువ్వే గెలవాలని

పదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుంది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన


కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే

మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే

కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటే

చేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటే

వేరే దారి లేక నా దారే నువ్వయ్యాక

తీరం చేరినాక ఈ కెరటం ఆగలేక

నిన్నే తాకాలని నీతో గడపాలని

ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని

మనసేమో మనసిచ్చింది

వయసేమో చనువిచ్చింది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన


ఆరాటం హద్దు దాటి మాట చెప్పమంటే

మోమాట సిగ్గుతోటి పెదవి విప్పనంటే

ఉత్సాహం నిన్నే పొందాలని ఉరకలు వేస్తుంటే

ఉల్లాసం నీకై చెందాలని పరుగులు తీస్తుంటే

ఏమీ పాలుపోక సగపాలే నువ్వయ్యాక

ప్రాయం వచ్చినాక పరువం ఆగలేక

నువ్వే కావాలని నిన్నే కలవాలని

మనసే విప్పాలని మాటే చెప్పాలని

ఒళ్ళంతా పులకిస్తుంది తుళ్ళింత కలిగిస్తుంది

అది ప్రేమో ఏమో తెలియని వింత యాతన

అది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన

Friday, September 14, 2007

Nee Sneham - ilA cUDu

ఇలా చూడు


ఇలా చూడు అరచేత వాలింది ఆకాశం

ఇదేనాడు అనుకోని అనురాగ సందేశం

ఈ అనుభవం వెన్నెల వర్షం ఎలా తెలపటం ఈ సంతోషం


నమ్మనంటావొ ఏమో నిజమే తెలుసా

అమృతం నింపె నాలో నీ చిరు స్పర్శ

ఒప్పుకోలేవో ఏమో మురిసే మనసా

రెప్పనే దాటి రాదే కలలో ఆశ

పొద్దేరాని నిద్దర్లోనే ఉండిపోని నిన్నే చూసే కల కోసం

సర్లే కాని చీకట్లోనే చేరుకోని నువ్వు కోరే అవకాశం

తక్కువేం కాదులే ఈ జన్మలో ఈ వరం


వానలా తాకగానే ఉరిమే మేఘం

వీణలా మోగుతుంది ఎదలో రాగం

స్వాగతం పాడగానే మదిలో మైకం

వచ్చి ఒడి చేరుతుందా ఊహాలోకం

ఉన్నట్టుండి నిన్నట్నుండి రాజయోగం దక్కినంత ఆనందం

అయ్యో పాపం ఎక్కడలేని ప్రేమ రోగం తగ్గదేమో ఏమాత్రం

తానుగా చేరెగా ప్రియమైన ప్రేమాలయం

Nee Sneham - EmO aunEmO

ఏమో ఔనేమో


ఏమో ఔనేమో నిజమేమో నాలో మైమరపే ఋజువేమో

ఏంచేసిందో ఆ చిన్నదీ ప్రేమించేసానందీమది

తన పేరైనా అడగాలన్నా ఎదురుంటేనా

చెప్పమ్మా వెన్నెలమ్మా ఎవ్వరే ఆ జాబిలి


ఒక్కటే ఙాపకం ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం

అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం

ఆ మెరుపు కంట పడకుంటే తన జంట కలిసి నడవందే

ఈ మరపు వదలనంటుందే ఇంకెలా

చెప్పమ్మా ఓ పావురమా ఆమెతో ఈ సంగతి


ఆమెనే వెతకటం అందుకే బ్రతకటం కొత్తగా ఉన్నదే అనుభవం

ప్రేమనే పిలవటం ప్రేమనే తెలపటం బొత్తిగా నేర్పదీ సతమతం

తన కంటి చూపులో మౌనం చదివేదెలాగ నా హృదయం

తన గుండె గూటిలో నే వాలేదెలా

చెప్పమ్మా కలవరమా ఆమెతో ఈ అలజడి

Wednesday, September 12, 2007

Manasanta Nuvve - tUnIga tUnIga

తూనీగా తూనీగా


తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక

దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగ

ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా

ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క

ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాక


దోసిట్లో ఒక్కో చుక్కా పోగేసి ఇస్తున్నాగా

వదిలేయకు సీతాకోక చిలకలుగా

వామ్మో బాగుందే చిట్కా నాకు నేర్పిస్తే చక్కా

సూర్యుడినే కరిగిస్తాగా చినుకులుగా

సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడు


ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ

తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా

ఓసారటువైపెళుతుంది

మళ్ళి ఇటువైపొస్తుంది

ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాదెలా

కూ కూ బండి మా ఊరుంది

ఉండిపోవె మాతో పాటు

Manasanta Nuvve - ceppavE prEma

చెప్పవే ప్రేమా


చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా

ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే

మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే


ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి

గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఇప్పుడే నువ్విలా వెళ్ళావనే సంగతి

గాలిలో పరిమళం నాకు చెబుతున్నది

ఎపుడో ఒక నాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని

ఇపుడూ నిను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని

నేస్తమా నీకు తెలిపేదెలా


ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని

గుండెలో ఊసులే నీకు చెప్పాలని

ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని

గుండెలో ఊసులే నీకు చెప్పాలని

నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా

నిను చేరే వరకు ఎక్కడ కరిగించను కంటి నీరుగా

స్నేహమా నీకు తెలిపేదెలా

Monday, September 3, 2007

Santosham - nE tolisAriga

నే తొలిసారిగ


నే తొలిసారిగ కలగన్నది నిన్నే కదా

నా కళ్ళెదురుగ నిలిచున్నది నువ్వే కదా

స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవే ప్రియతమా

మౌనమో మధుర గానమో తనది అడగవే హృదయమా


రెక్కలు తొడిగిన తలపు నువే కాదా నేస్తమా

ఎక్కడ వాలను చెప్పు నువే సహవాసమా

హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా

వద్దకు రాకని ఆపకిల అనురాగమా

నడకలు నేర్పిన ఆశవు కద

తడబడనీయకు కదిలిన కథ

వెతికే మనసుకు మమతే పంచుమా


ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా

అమృతమనుకొని నమ్మడమే ఒక శాపమా

నీ ఓడి చేరిన ప్రతి మదికి బాధే ఫలితమా

తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా

పెదవులపై చిరునవ్వుల దగ

కనబడనీయవు నిప్పుల సెగ

నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపవు కదా

నీ బాటేమిటో ఏ జంటకీ చూపవు కదా

తెంచుకోనీవు పంచుకోనీవు ఇంత చెలగాటమా

చెప్పుకోనీవు తప్పుకోనీవు నీకు ఇది న్యాయమా

పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా

పంతమా బంధమా

Santosham - nuvvaMTE nAkishTamani

నువ్వంటే నాకిష్టమని


నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస

నువ్వేలే నాలోకమని అన్నది నా ప్రతి ఆశ

నీ నవ్వులో శృతి కలిపి పాడగ

నీ నీడలో అణువణువు ఆడగ

అనురాగం పలికింది సంతోషం స్వరాలుగ


నువ్వు నా వెంట ఉంటే అడుగడుగున నడుపుతుంటే

ఎదురయే నా ప్రతి కల నిజమల్లె కనిపించదా

నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నలుతుంటే

కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించద

వరాలన్ని సూటిగ ఇలా నన్ను చేరగ

సుదూరాల తారక సమీపాన వాలగ

లేనేలేదు ఇంకే కోరిక


ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం

నిన్నగ సన సన్నగ చేజారిపోనీయక

చూడు నా ఇంద్రజాలం వెనుతిరిగి వస్తుంది కాలం

రేపుగ మన పాపగ పుడుతుంది సరికొత్తగ

నీవు నాకు తోడుగ నేను నీకు నీడగ

ప్రతి రేయి తీయగ పిలుస్తోంది హాయిగ

ఇలా ఉండిపోతే చాలుగ

Nee Sneham - chinuku taDiki

చినుకు తడికి


చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా

ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

మువ్వలె మనసుపడు పాదమా

ఊహలె ఉలికి పడు ప్రాయమా

హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా

ఆమని మధువనమా ఆ ఆమని మధువనమా


సరిగస సరిగస రిగమదని సరిగస సరిగస నిదమ దని

సస నిని దద మమ గమదనిరిస గ

నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గ

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు

కలిపి నిన్ను మలిచాడొ ఏమొ బ్రహ్మ

పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు

కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మ

పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా

ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా


సగమగ రిస సనిదమగ సగ సగమగ రిస సనిదమగ

సగస మగస గమద నిదమ గమదనిస

సనిస సనిస నిస నిస నిస గమ రిస

సనిస సనిస నిస నిస నిస గమ రిస

గగ నిని గగ నిని దగ నిగ సప

వరములన్ని నిను వెంటబెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని

అడుగుతున్నవే కుందనాల బొమ్మా

సిరుల రాణి నీ చేయిపట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి

ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా

అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా

ఆ రాముని సుమ శరమా ఆ రాముని సుమ శరమా