Showing posts with label Lyrics - Aatreya. Show all posts
Showing posts with label Lyrics - Aatreya. Show all posts

Tuesday, July 1, 2008

Abhinandana - Prema Ledani

ప్రేమ లేదని


ప్రేమ లేదని ప్రేమించరాదని

ప్రేమ లేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ

ఓ ప్రియా జోహారులు


మనసు మాసిపోతే మనిషే కాదని

కటిక రాయికైనా కన్నీరుందని

వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని

గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ

ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి

ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి

మోడుబారి నీడ తోడు లేకుంటిని


గురుతు చెరిపివేసి జీవించాలని

చెరపలేకపోతే మరణించాలని

తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని

గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ

ముక్కలలో లెక్కలేని రూపాలలో

ముక్కలలో లెక్కలేని రూపాలలో

మరల మరల నిన్ను చూసి రోదించనీ

Abhinandana - Prema Enta Madhuram

ప్రేమ ఎంత మధురం


ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం

మింగినాను హలాహలం


ప్రేమించుటేనా నా దోషము

పూజించుటేనా నా పాపము

ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు

కన్నీరుగ ఈ కరిగే కళ్ళు

నాలోని నీ రూపము

నా జీవనాధారము

అది ఆరాలి పోవాలి ప్రాణము


నేనోర్వలేను ఈ తేజము

ఆర్పేయరాదా ఈ దీపము

ఆ చీకటిలో కలిసే పోయి

నా రేపటిని మరిచే పోయి

మానాలి నీ ధ్యానము

కావాలి నే శూన్యము

అపుడాగాలి ఈ మూగ గానం

Abhinandana - Ade Neevu Ade Nenu

అదే నీవు అదే నేను


అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా


కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము

కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము

గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము

అదే స్నేహము అదే మోహము

అదే స్నేహము అదే మోహము

ఆది అంతం ఏదీ లేని గానము


నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు

అదే బాసగా అదే ఆశగా

అదే బాసగా అదే ఆశగా

ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను