Showing posts with label Movie - Allari Priyudu. Show all posts
Showing posts with label Movie - Allari Priyudu. Show all posts

Monday, August 2, 2010

Allari Priyudu - Aho Oka Manasuku Nede

అహో ఒక మనసుకు నేడే


అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు

అహో తన పల్లవి పాడే చల్లని రోజు

ఇదే ఇదే కుహూ స్వరాల కానుక

మరో వసంత గీతిక జనించు రోజు


మాట పలుకు తెలియనిది

మాటున ఉండే మూగ మది

కమ్మని తలపుల కావ్యమయె

కవితలు రాసే మౌనమది

రాగల రోజుల ఊహలకి

స్వాగతమిచ్చే రాగమది

శృతిలయలెరుగని ఊపిరికి

స్వరములు కూర్చే గానమది

ఋతువుల రంగులు మార్చేది

కల్పన కలిగిన మది భావం

బ్రతుకును పాటగ మలిచేది

మనసున కదిలిన మృదునాదం

కలవని దిక్కులు కలిపేది

నింగిని నేలకు దింపేది

తనే కదా వారధి

క్షణాలకే సారధి మనస్సనేది


చూపులకెన్నడు దొరకనిది

రంగు రూపు లేని మది

రెప్పలు తెరవని కన్నులకు

స్వప్నాలెన్నో చూపినది

వెచ్చని చెలిమిని పొందినది

వెన్నెల కళగల నిండు మది

కాటుక చీకటి రాతిరికి

బాటను చూపే నేస్తమది

చేతికి అందని జాబిలిలా

కాంతులు పంచే మణిదీపం

కొమ్మల చాటున కోయిలలా

కాలం నిలిపే అనురాగం

అడగని వరములు కురిపించి

అమృతవర్షిని అనిపించే

అమూల్యమైన పెన్నిధి

శుభోదయాల సన్నిధి మనస్సనేది