Showing posts with label Singer - Kumar Sanu. Show all posts
Showing posts with label Singer - Kumar Sanu. Show all posts

Monday, September 17, 2007

Nuvvu Naku Nachchav - okka sAri ceppalEvA

ఒక్క సారి చెప్పలేవా


ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని

చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత

ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ

వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి

నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి


చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని

చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా

లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని

జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా

కలలన్నవి కలలని నమ్మనని

అవి కలవని పిలవకు కలవమని

మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా


అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో

చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా

అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో

కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా

మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా

అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా