Showing posts with label Singer - Sreya Ghoshal. Show all posts
Showing posts with label Singer - Sreya Ghoshal. Show all posts

Friday, February 5, 2016

Kanche - Itu Itu Itu Ani

 ఇటు ఇటు ఇటు అని


ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివో...ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో...ఏమో

సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారయ్యిందో సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచి వెళ్ళిపోదా
తనోటిఉందని మనం ఎలాగ గమనించం గనక
కలగంటున్నా మెళకువలో ఉన్నాం కదా
మన దరికెవరు వస్తారు కదిలించంగ
ఉషస్సెలా ఉదయిస్తుందో నిశీధెలా ఎటు పోతుందో
నిదుర ఎపుడు నిదరౌతుందో మొదలు ఎపుడు మొదలౌతుందో
ఇలాంటివేం తెలియక ముందే
మనం అనే కథానిక మొదలైందో


పెదాల మీదుగ అదేమి గల గల పదాల మాదిరిగ
సుధాల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగ
ఇలాంటి వేళకు ఇలాంటి ఊసులు ప్రపంచ భాష కద
ఫలాన అర్థం అనేది తెలిపే నిఘంటువుండదుగ
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగ
వినబోతున్న సన్నాయి మేళాలుగ
సడేలేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరంలేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో
ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో

Monday, December 10, 2007

Gautam SSC - EdO ASa

ఏదో ఆశ


ఏదో ఆశ ఎదలో మొదలైనది ఎపుడూ జాడ లేనిది

నిజం తెలుసా ఈనాటిది కాదది ఇపుడే మేలుకున్నది

ఇలా నీ శ్వాస గిల్లి లెమ్మంటూ నన్నల్లుకుంది నిశీధిలో ఉషోదయంలా


నీ లాలిని పాడే లాలన నేనోయ్

జాబిలికై ఆశ పడే బాలను నేను

తల్లిగా జోకొట్టి చలువే పంచాలోయ్

చెల్లిగా చేపట్టి చనువే పంచాలోయ్

సరిగా నాకే ఇంకా తేలని ఈవేళ


నీ నీలి కనుల్లో వెతుకుతు ఉన్నా

క్షణానికో రూపంలో కనబడుతున్నా

జాడవై నావెంట నిను నడిపించాలోయ్

జానకై జన్మంతా జంటగా నడవాలోయ్

తెలిసీ తెలీనట్టే ఉందీ ఈ లీల

Wednesday, September 12, 2007

Okariki Okaru - veLLipOtE elA

వెళ్ళిపోతే ఎలా


వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా

అయినా ఎందుకిలా తడబాటు అంతలా

తెగ హుషారుగా ఎగిరిపోకే తగని ఊహ వెంట

సరైన దారి తెలియందే ఈ ఉరుకులెందుకంట


ఆమె వలలో చిక్కుకుందా సమయం

ప్రేమ లయలో దూకుతుందా హృదయం

నేను ఇపుడు ఎక్కడ ఉన్నానంటే

నాక్కూడ అంతు చిక్కకుంటే

గమ్మత్తుగానే ఉన్నదంటే

నాకేదో మత్తు కమ్మినట్టే


రమ్మంది గాని నన్ను చేరి మెరుపు సైగ చేసి

చెప్పింది నింగి చెలిదారి చినుకు వంతెనేసి

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా

వెళ్ళనంటే ఎలా ఎలా


తాను కూడ రాకపోతే నాతో

నేను కూడ ఆగిపోనా తనతో

నా ప్రాణం ఉంది తన వెంటే

నా ఊపిరుంది తాననంటే

కళ్ళార చూసానంటు వుంటే

ఎట్టా నమ్మేది స్వప్నమంటే


వెనక్కి వెళ్ళి వెతకాలి తిరిగి ఆ క్షణాన్ని

మరొక్కసారి చూడాలి కనులు ఆ నిజాన్ని

వెళ్ళనంటే ఎలా మనసా అటే అలా

వెళ్ళనంటే ఎలా ఎలా

Tuesday, September 11, 2007

Varsham - kOpamA nApaina

కోపమా నాపైన


కోపమా నాపైన ఆపవా ఇకనైనా

అంతగా బుస కొడుతుంటే నేను తాళగలనా

చాలులే నీ నటన సాగవే ఇటుపైనా

ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనె లలనా

దరి చేరిన నెచ్చెలిపైన దయ చూపవ కాస్తైన

మన దారులు ఎప్పటికైనా కలిసేనా


కస్సుమని కారంగా కసిరినది చాలింక

ఉరుము వెనుక చినుకు తడిగా కరగవా కనికారంగా

కుదురుగా కడదాక కలిసి అడుగేయవుగా

కనుల వెనుకే కరిగిపోయే కలవి గనుక

నను గొడుగై కాసే నువ్వు పిడుగులు కురిపిస్తావా

నువు గొడుగును ఎగరేస్తావే జడివానా


తిరిగి నిను నాదాక చేర్చినది చెలిమేగా

మనసులోని చెలియవమ్మా చెరిపినా చెరగవుగనుక

సులువుగా నీలాగా మరచిపోలేదింకా

మనసు విలువ నాకు బాగా తెలుసుగనుక

ఎగసే అల ఏనాడైనా తన కడలిని విడిచేనా

వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా