Showing posts with label Movie - Swati Kiranam. Show all posts
Showing posts with label Movie - Swati Kiranam. Show all posts

Tuesday, October 13, 2009

Swati Kiranam - Aanati Neeyara

ఆనతినీయరా హరా


ఆనతినీయరా హరా

సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా

ఆనతినీయరా హరా


నీ ఆన లేనిదే రచింపజాలునా

వేదాల వాణితో విరించి విశ్వనాటకం

నీ సైగ కానిదే జగాన సాగునా

ఆయోగమాయతో మురారి దివ్యపాలనం

వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై

కదులునుగా సదా సదాశివా

ఆనతినీయరా హరా

అచలనాధ అర్చింతునురా

ఆనతినీయరా


జంగమదేవర సేవలు గొనరా

మంగళదాయక దీవెనలిడరా

సాష్టాంగముగ దండము చేతురా

ఆనతినీయరా


శంకరా శంకించకుర

వంకజాబిలిని జడను ముడుచుకుని

విషపునాగులను చంకనెత్తుకుని

నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క

కడగంటి చూపు పడనీయవేయిని

నీ కింకనుక సేవించుకుందురా

ఆనతినీయరా


రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష

నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక

పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా

ఆనతినీయరా హరా

సన్నుతిసేయగా సమ్మతినీయరా

Tuesday, September 4, 2007

Swati Kiranam - SRti nIvu

శృతి నీవు


శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి


నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధము

నీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప

చేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప


శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గళసీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే

ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం జననీ భవ తారక మంత్రాక్షరం

Swati Kiranam - koMDA kOnallO

కొండా కోనల్లో


కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

కోరి కోరి కూసింది కోయిలమ్మ

కోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మ

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో

గోదారి గంగమ్మా సాయల్లో


నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా

రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా

నేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగా

రివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగా

ఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊగంగా

ఉంగా ఉంగా రారంరంగా ఉల్లాసాలే ఊగంగా

ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగా

తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా

తెనుగుదనం నోరూరంగా తేటగీతి గారాబంగా

తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా


ఝుమ్మని తుమ్మెద తీయంగా కమ్మని రాగం తీయంగా

జాజిమల్లి సంపెంగ జానపదాలే నింపంగా

కమ్మని రాగం తీయంగా జానపదాలే నింపంగా

చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా

చెట్టు పుట్ట నెయ్యంగా చెట్టాపట్టాలెయ్యంగా

చిలకా పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా

ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా

ఏటి పాట లాలించంగా తోట తల్లి లాలించంగా

స్వరాలన్ని దీవించంగ సావాసంగ

Swati Kiranam - teli maMchu

తెలిమంచు కరిగింది


తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ

నీ దోవ పొడవునా కువకువల స్వాగతము

నీ కాలి అలికిడికి మెలకువల వందనము


ఈ పూల రాగాల పులకింత గమకాలు

గారాబు కవనాల గాలి సంగతులు

నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు

పల్లవించును ప్రభూ పవళించు భువనాలు

భానుమూర్తి! నీ ప్రాణ కీర్తన విని

పలుకని ప్రణతులని ప్రణవ శృతిని

పాడనీ ప్రకృతిని ప్రధమ కృతిని


భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు

నీ రాజసానికవి నీరాజనాలు

పసరు పవనాలలో పసికూన రాగాలు

పసిడి కిరణాల పడి పదునుదేరిన చాలు

తలయూర్చు తలిరాకు బహుపరాక్కులు విని

దొరలనీ దోరనగవు దొంతరని

తరలనీ దారి తొలగి రాతిరిని

Swati Kiranam - jAligA jAbilamma

జాలిగా జాబిలమ్మ


జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా

రెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేత

పదహారు కళలని పదిలంగా ఉంచనీ

ఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత


కాటుక కంటినీరు పెదవులనంటనీకు

చిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకు

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

నీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా


సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచి

సంతసాన మునిగింది సంతులేని పార్వతి

సుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచి

పెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి


ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందా

ఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితి

కాలకూటము కన్న ఘాటైన గరళమిది

గొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది


ఆటు పోటు ఘటనలివి ఆటవిడుపు నటనలివి

ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేవి

నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా

కంచి కెళ్ళిపోయేవే కధలన్నీ