Showing posts with label Movie - Annamayya. Show all posts
Showing posts with label Movie - Annamayya. Show all posts

Saturday, December 8, 2007

Annamayya - telugu padAniki

తెలుగు పదానికి


తెలుగు పదానికి జన్మదినం

ఇది జానపదానికి ఙానపదం

ఏడు స్వరాలే ఏడుకొండలై

వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం


అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము

బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది

శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై

దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి

నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి

శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని

తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము

నందనానందకారకము


పద్మావతియే పురుడుపోయగా

పద్మాసనుడే ఉసురుపోయగా

విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై

అవతరించెను అన్నమయ

అసతోమా సద్గమయా


పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా

హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా

తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ

తమసోమా జ్యోతిర్గమయా