Showing posts with label Movie - Chirunavvuto. Show all posts
Showing posts with label Movie - Chirunavvuto. Show all posts

Tuesday, May 12, 2009

Chirunavvuto - Ninnala Monnala

A super-light and funny song!
నిన్నలా మొన్నలా


నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందర
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా

ఇల్లు చూసి సెల్ఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్ధం అంతా ఐ లవ్ యూ లో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో

మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజ్నూలా ఇదైపోతూ ఫోసెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ చానెల్ రోజుల్లో అవినీకవసరమా
లవ్ కి లైఫ్ కి లింకు పెట్టుకొందుకి దేవదాసు రోజులా ఇవి
రోమియో జూలియెట్ లాగ చావటానికి సిద్ధపడ్డ ప్రేమలా ఇవి

కాషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదే పనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే ఐ యాం సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్ములా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా


Monday, September 3, 2007

Chirunavvuto - saMtOshaM sagaM balaM

సంతోషం సగం బలం


సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మ

ఆ సంగీతం నీతోడై సాగవె గువ్వమ్మ

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి


నిన్నటి నీడలే కనుపాపని ఆపితే

రేపటి వైపుగా నీ చూపు సాగదుగా

నిన్నటి నీడలే కనుపాపని ఆపితే

రేపటి వైపుగా నీ చూపు సాగదుగా

చుట్టమల్లె కష్టమొస్తె కళ్ళనీళ్ళు పెట్టుకుంటు

కాళ్ళు కడిగి స్వాగతించకు

ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనంపకుండా

లేనిపోని సేవ చెయ్యకు

మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలుకద

ముసురుకునే నిసి విలవిలలాడుతు పరుగులు తీయద

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి


ఆశలు రేపినా అడియాశలు చూపినా

సాగే జీవితం అడుగైనా ఆగదుగా

ఆశలు రేపినా అడియాశలు చూపినా

సాగే జీవితం అడుగైనా ఆగదుగా

నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ

నిద్ర మానుకోగలమా

ఎంత మంచి స్వప్నమైన అందులోనె ఉంటూ

లేవకుండ ఉండగలమా

కలలుగని అవి కలలే అని తెలిసినదే తెలివమ్మా

కలతలని నీ కిలకిలతో తరిమెయ్యవె చిలకమ్మా

నవ్వే నీ కళ్ళలో లేదా ఆ జాబిలి

నవ్వే ముంగిళ్ళలో రోజూ దీపావళి