Showing posts with label Movie - Nuvvu Naku Nachchav. Show all posts
Showing posts with label Movie - Nuvvu Naku Nachchav. Show all posts

Monday, September 17, 2007

Nuvvu Naku Nachchav - O navvu chAlu

ఓ నవ్వు చాలు


నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు

తాను పలికితె చాలు తేనె జలపాతాలు

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో

గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో

అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను

గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం

రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను

కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

Nuvvu Naku Nachchav - nA cUpE ninu vetikinadi

నా చూపే నిను వెతికినది


నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది

నాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుంది

నువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటు

నీకే నీకే చెప్పాలి అంటున్నది


నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనం

నాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయం

గుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటే

వేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే


పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహం

అడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరం

దిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ ఉంటే

పగలు కూడ రేయైపోదా నీవుంటే నా వెంటే

Nuvvu Naku Nachchav - okka sAri ceppalEvA

ఒక్క సారి చెప్పలేవా


ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని

చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని

మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత

ఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళ

వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి

నిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి


చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకుని

చేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామా

లేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అని

జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామా

కలలన్నవి కలలని నమ్మనని

అవి కలవని పిలవకు కలవమని

మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా


అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరుజల్లులతో

చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా

అంతులేని తన అల్లరితో అలుపులేని తన అలజడితో

కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా

మనసుంటే మార్గం ఉంది కద అనుకుంటే అందనిదుంటుందా

అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా

Nuvvu Naku Nachchav - unnamATa cheppanIvu

ఉన్నమాట చెప్పనీవు


ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ

నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ

అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద

మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద

పంతం మానుకో భయం దేనికో


వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక

నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా

నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక

నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా

అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా

అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా

ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా


ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల

అయోమయంగ వెయ్యకలా హాయి వల

నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ

దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ

మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా

తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా

మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే

Nuvvu Naku Nachchav - AkASaM digi vachchi

ఆకాశం దిగివచ్చి


ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి

చెరి సగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం

ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధు జనం

మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే

అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవీ గాలులే


చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు

ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు

ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో

వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో

తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా

ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా


విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు

సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు

సందు చూసి చక చక ఆడే జూద శిఖామణులు

పందిరంతా ఘుమ ఘుమలాడే విందు సువాసనలు

తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ

తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా