Showing posts with label Lyrics - Veturi. Show all posts
Showing posts with label Lyrics - Veturi. Show all posts

Sunday, August 31, 2008

Matrudevobhava - Venuvai Vachanu

వేణువై వచ్చాను


వేణువై వచ్చాను భువనానికి

గాలినై పోతాను గగనానికి

మమతలన్నీ మౌనగానం

వాంఛలన్నీ వాయులీనం


ఏడు కొండలకైన బండతానొక్కటే

ఏడు జన్మల తీపి ఈ బంధమే

నీ కంటిలో నలక లో వెలుగు నే కనక

మేను నేననుకుంటె ఎద చీకటే హరీ!

రాయినై ఉన్నాను ఈనాటికీ

రామ పాదము రాక ఏనాటికి


నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే

నిప్పు నిప్పుగ మారే నా గుండెలో

ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు

పుట్టిల్లు చేరే మట్టి ప్రాయాలు హరీ!

రెప్పనై ఉన్నాను మీ కంటికి

పాపనై వస్తాను మీ ఇంటికి

Tuesday, July 1, 2008

Subhalekha - Raagala Pallakilo

రాగాల పల్లకి లో

లాలా ల ల లల లలాలా
రాగాలా పల్లకిలో కోయిలమ్మ రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
....
నా ఉద్యోగం పోయిందండి!!! ...తెలుసు... అందుకే
....
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
బహుశా ఆది తెలుసో ఏమో
బహుశా ఆది తెలుసో ఏమో..

జాణ కోయిలా రాలెదూ ఈ తొటకి ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా అందుకేనా.. అందుకేనా..

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
బహుశా తను ఎందుకనేమో ..
లల లాలా లాలలల లాలా..
బహుశా తాను ఎందుకనేమో .. గడుసు కోయిలా ..

రాలేదు ఈ తొటకీ ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా.. రానేలా నీవున్తే కూనలమ్మ..
రాగాలా పల్లకిలో కోయిలమ్మ.. రానేలా నీవున్తే కూనలమ్మ..


Sunday, December 9, 2007

Saptapadi - rEpalliya eda jhalluna

రేపల్లియ


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి


కాళింది మడుగున కాళీయుని పడగల

ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని

అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ

తాండవమాడిన సరళి గుండెలనూదిన మురళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


అనగల రాగమై తొలుత వీనులలరించి

అనలేని రాగమై మరల వినిపించి మరులే కురిపించి

జీవనరాగమై బృందావన గీతమై

కన్నెల కన్నుల కలువల వెన్నెల దోచిన మురళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


వేణుగాన లోలుని మురుపించిన రవళి

నటనల సరళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మువ్వల మురళి

ఇదేనా ఆ మురళి


మధురా నగరిలో యమునా లహరిలో

ఆ రాధ ఆరాధనాగీతి పలికించి

సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై

రాసలీలకే ఊపిరిపోసిన అందెల రవళి

ఇదేనా ఇదేనా ఆ మురళి


రేపల్లియ యెద ఝల్లున పొంగిన రవళి

నవరస మురళి ఆ నందన మురళి

ఇదేనా ఆ మురళి మోహన మురళి

ఇదేనా ఆ మురళి


Listen to the song

Saptapadi - YE kulamu

ఏ కులము


ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


ఏడు వర్ణాలు కలిసి ఇంద్రధనసౌతాది

అన్నీ వర్ణాలకు ఒకటే ఇహము పరముంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


ఆదినుంచి ఆకాశం మూగది

అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు

ఈ నడమంత్రపు మనుషులకే మాటలు

ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది

మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మంది


Listen to the song

Saturday, December 8, 2007

Annamayya - telugu padAniki

తెలుగు పదానికి


తెలుగు పదానికి జన్మదినం

ఇది జానపదానికి ఙానపదం

ఏడు స్వరాలే ఏడుకొండలై

వెలసిన కలియుగ విష్ణుపదం

అన్నమయ్య జననం

ఇది అన్నమయ్య జననం


అరిషడ్వర్గము తెగనరికే హరి ఖడ్గమ్మిది నందకము

బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి నాదాశీస్సులు పొందినది

శివలోకమ్మున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై

దివ్యసభలలో భవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి

నీరద మండల నారద తుంబుర మహతీగానపు మహిమలు తెలిసి

శితహిమకందర యతిరాట్సభలో తపః ఫలమ్ముగ తళుకుమని

తల్లితనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో ప్రవేశించే ఆ నందకము

నందనానందకారకము


పద్మావతియే పురుడుపోయగా

పద్మాసనుడే ఉసురుపోయగా

విష్ణుతేజమై నాదబీజమై ఆంధ్రసాహితీ అమరకోశమై

అవతరించెను అన్నమయ

అసతోమా సద్గమయా


పాపడుగా నట్టింటపాకుతూ భాగవతము చేపట్టెనయా

హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా

తెలుగుభారతికి వెలుగుభారతై ఎదలయలో పదకవితలు కలయా

తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ

తమసోమా జ్యోతిర్గమయా

Godavari - uppongelE gOdAvari

ఉప్పొంగెలే గోదావరి


షడ్యమాం భవతి వేదం

పంచమాం భవతి నాదం

శ్రుతిశిఖరే నిగమఝరే స్వరలహరే


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి

వేదమంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి

రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం

వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం

ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం

ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ

నది ఊరేగింపులో పడవ మీద లాగా

ప్రభువు తాను కాగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


గోదారమ్మ కుంకంబొట్టు దిద్ది మిరప ఎరుపు

లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు

చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి

సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి

లోకంకాని లోకంలోన ఏకాంతాల వలపు

అల పాపికొండల నలుపు కడగలేక

నవ్వు తనకు రాగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

వెతలు తీర్చు మా దేవేరి

వేదమంటి మా గోదారి

శబరి కలిసిన గోదారి

రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా

చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి

భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి


Godavari - RAma chakkani sItaki

రామచక్కని సీతకి


నీలగగన ఘనవిచలన ధరణిజ శ్రీరమణ

మధుర వదన నలిన నయన మనవి వినరా రామా


రామచక్కని సీతకి అరచేత గోరింట

ఇంత చక్కని చుక్కకి ఇంకెవరు మొగుడంట

రామచక్కని సీతకి


ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే

ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే

ఎత్తగలడా సీతజడను తాళికట్టేవేళలో

రామచక్కని సీతకి


ఎర్రజాబిలి చేయిగిల్లి రాముడేడని అడుగుతుంటే

చూడలేదని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే

నల్లపూసైనాడు దేవుడు నల్లని రఘురాముడు

రామచక్కని సీతకి


చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా

నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డునిలిచే

చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామచక్కని సీతకి


ఇందువదన కుందరదన మందగమన భామ

ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ

Tuesday, September 18, 2007

Ravoyi Chandamama - swapna vENuvEdO

స్వప్న వేణువేదో


స్వప్న వేణువేదో సంగీతమాలపించే

సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే

జోడైన రెండు గుండెల ఏక తాళమో

జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో

లే లేత పూల బాసలు కాలేవా చేతి రాతలు


నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేసా వెన్నెల జాగారం

ప్రేమ నేడు రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం

కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ

నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాన

కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా


నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో

ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో

మనిషి నీడగా మనసు తోడుగా మలచుకున్న బంధం

పెను తుఫానులే ఎదురు వచ్చినా చేరాలీ తీరం

వారేవా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం

Tuesday, September 4, 2007

Gangotri - jeevana vaahini

జీవన వాహిని


ఓం ఓం

జీవన వాహిని ... పావని

కలియుగమున కల్పతరువు నీడ నీవని

కనులు తుడుచు కామధేను తోడు నీవని

వరములిచ్చి భయము తీర్చి శుభము కోర్చు గంగాదేవి

నిను కొలిచిన చాలునమ్మ సకల లోకపావని

భువిని తడిపి దివిగ మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి

గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి


మంచు కొండలో ఒక కొండవాగులా ఇల జననమొందిన విరజాహిని

విష్ణుచరణమే తన పుట్టినిల్లుగా శివగిరికి చేరిన సురగంగ నీవని

అత్తింటికి సిరులనొసను అలకనందమై

సగర కులము కాపాడిన భాగీరధివై

బదరీవన హృషీకేశ హరిద్వార ప్రయాగముల మణికర్ణిక తనలోపల వెలసిన శ్రీవారణాసి గంగోత్రి


గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి


జీవనదివిగా ఒక మోక్ష నిధివిగా పండ్లుపూలుపసుపుల పారాణి రాణిగా

శివుని జటలనే తన నాట్యజతులుగా జలకమాడు సతులకు సౌభాగ్యధాత్రిగా

గండాలను పాపాలను కడిగివేయగా ముక్తినదిని మూడుమునకలే చాలుగా

జలదీవెన తలకుపోసె జననీ గంగాభవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగపూదండ గంగోత్రి


గలగలగల గంగోత్రి హిమగిరిదరిహరిపుత్రి