Showing posts with label Singer - Sankar Mahadevan. Show all posts
Showing posts with label Singer - Sankar Mahadevan. Show all posts

Saturday, May 23, 2009

Okkadu - Ramunnaina Krushnunnaina

రాముణ్ణైన కృష్ణుణ్ణైన


హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే


రాముణ్ణైన కృష్ణుణ్ణైన కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడ స్థంబించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతాపాఠం తెలుపమా!


చార్మినార్ చాటు కథకీ తెలియదీ నిత్య కలహం
భాగమతి ప్రేమ స్మృతికి బహుమతీభాగ్యనగరం
ఏ మాయ తంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెర
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర


పసిడి పతకాల హారం కాదురా విజయతీరం
ఆటనేమాటకర్ధం నిను నువే గెలుచు యుద్ధం
శ్రీరామ నవమి జరిపే ముందు లంకను గెలవర
ఈ విజయదశమి కావాలంటే చెడును జయించర

Tuesday, November 27, 2007

Happy - Nee KOsaM

నీ కోసం


నీ కోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ

తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని

చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమని


నీ కోసం ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ


దూరంగానే ఉంటా నువు కందే మంటై చేరగా

దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా

కలకలాన్ని రగిలిస్తున్న చలి సంకెళ్ళు తెగేట్టుగా


నీ కోసం ఒక మధుమాసం


పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా

ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్ళో వాలగా

కలలెట్టున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా

Monday, September 17, 2007

Nuvve Nuvve - cheliyA nI vaipE vastunnA

చెలియా నీవైపే వస్తున్నా


చెలియా నీవైపే వస్తున్నా

కంట పడవా ఇకనైనా ఎక్కడున్నా

నిద్దర పోతున్న రాతిరినడిగా

గూటికి చేరిన గువ్వలనడిగా

చల్లగాలినడిగా ఆ చందమామనడిగా

ప్రియురాలి జాడ చెప్పరేమని

అందరినీ ఇలా వెంట పడి అడగాలా

సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా


అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం

అరెరే పాపమని జాలిగా చూసే జనం

గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా

నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా


నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని

ఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగాని

కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని

పరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే

Nuvvu Naku Nachchav - O navvu chAlu

ఓ నవ్వు చాలు


నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు

తాను పలికితె చాలు తేనె జలపాతాలు

ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది

ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది

పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో

గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో

అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను

గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం

రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను

కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

Sunday, September 16, 2007

Nuvvostanante Nenoddantana - chaMdrullO uMDE kuMdElu

చంద్రుళ్ళో ఉండే కుందేలు


చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా

కిందికొచ్చి నీలా మారిందా

చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా

నిన్ను మెచ్చి నీలో చేరిందా

నువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంట

నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా


గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో

నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో


కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా

పాపలాంటి లేత పదం పాఠశాలగా

కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా

జావళీల జాణతనం బాటచూపగా

కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా

అంతటా ఎన్నో వర్ణాలు

మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా

ఇంతలా ఏవో రాగాలు


ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా

సాగుతున్న ఈ పయనం ఎంత వరకో

రేపు వైపు ముందడుగా లేని పోని దుందురుకా

రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో

మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే

లెక్కలే మాయం అయిపోవా

రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే

దిక్కులే తత్తర పడిపోవా

Wednesday, September 5, 2007

Chakram - raMgELi hOLi

రంగేళి హోళి


కృష్ణ కృష్ణ కృష్ణ హే రామ రామ రామ

చిన్నా పెద్దా అంతా పండుగ చేయాలంట

తీపి చేదు అంతా పంచి పెట్టాలంట


రంగేళి హోళి హంగామా కేళి

ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి

రవ్వల రించోలి సిరి దివ్వెల దీవాలి

ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి

పంచాంగం చెబితేగాని పండుగ రానందా

సంతోషంగా గడపడానికో సుముహూర్తం ఉంటుందా


తినేది చేదని తెలిసి అది ఉగాది విందని తలచి

ఇష్టపడే ఆ పూటే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది

గడపలు అన్నీ జరిపి ఆ గణపతి పండుగ జరిపి

నిమ్మజనంగా జనం జరిపే పయనం నిత్య భాద్రపదమౌతుంది

లోకుల చీకటి తొలగించే శుభసమయం కోసం వెతికే

చూపులు దీపాలుగ జేసే జాగరణే శివరాత్రి

ప్రత్యేకంగా బంధువులొచ్చే రోజొకటుండాలా

చుట్టూ ఇందరు చుట్టాలుంటే సందడిగా లేదా


తల్లుల జోలపదాలై గొల్లల జానపదాలై

నరుడికి గీత పథమై నడవడమంటే అర్ధం కృష్ణ జయంతి

అందరి ఎండకు మనమే పందిరయ్యే లక్షణమే

మనిషితనం అంటారని గుర్తించడమే శ్రీరామ నవమయింది

మనలో మనమే కలహించి మనలో మహిషిని తలపించి

విజయం సాధించే క్షణమే దసరా దశమి అవుతుంది

పదుగురు పంచిన వెచ్చని ఊపిరి భోగి మంటయింది

మది ముంగిలిలో ముగ్గులు వేసే శాంతే సంక్రాంతి


ఒకటి రెండంటూ విడిగా లెక్కెడితే

తొమ్మిది గుమ్మం దాటవు ఎపుడూ అంకెలు ఎన్నంటే

పక్కన నిలబెడుతూ కలుపుకుపోతుంటే

లెక్కలకైనా లెక్కలకందవు సంఖ్యలు ఎన్నంటే

నువ్వు నువ్వుగా నేను నేనుగా ఉన్నామనుకుంటే

కోట్ల ఒకటై ఎవరి ముసుగులో వాళ్ళుంటామంతే

నిన్ను నన్ను కలిపి మనమని అనుకున్నామంటే

ప్రపంచ జనాభా మొత్తం కలిపితే మనిషితనం ఒక్కటే