Showing posts with label Singer - SP Charan. Show all posts
Showing posts with label Singer - SP Charan. Show all posts

Tuesday, May 12, 2009

Chirunavvuto - Ninnala Monnala

A super-light and funny song!
నిన్నలా మొన్నలా


నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందర
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా

ఇల్లు చూసి సెల్ఫోను బిల్లు చూస్తేనే భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్ధం అంతా ఐ లవ్ యూ లో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యో

మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజ్నూలా ఇదైపోతూ ఫోసెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామా
వీ చానెల్ రోజుల్లో అవినీకవసరమా
లవ్ కి లైఫ్ కి లింకు పెట్టుకొందుకి దేవదాసు రోజులా ఇవి
రోమియో జూలియెట్ లాగ చావటానికి సిద్ధపడ్డ ప్రేమలా ఇవి

కాషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదే పనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే ఐ యాం సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా నేటి కొత్త ప్రేమ ఫార్ములా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా అంతకన్న సీనులేదురా


Tuesday, September 11, 2007

Varsham - mellagA karaganI

మెల్లగా కరగనీ


మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం

చల్లగా తెరవనీ కొంటె తలపుల ద్వారం

వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం

చినుకు పూల హారాలే అల్లుతున్నది మనకోసం

తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లుల వంతెన వేసిన శుభవేళ

ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకే సొంతం

ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం


నీ మెలికలలోన ఆ మెరుపును చూస్తున్నా

ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా

ఆ ఉరుములలోన నీ పిలుపును వింటున్నా

ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా

మతిచెడే దాహమై అనుసరించి వస్తున్నా

జతపడే స్నేహమై అనునయించనా

చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిను విడదా


ఏ తెరమరుగైనా ఈ చొరవను ఆపేనా

నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా

ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా

ఆ వరుణునికే ఋణపడిపోనా ఈపైనా

త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైనా

విడుదలే వద్దనే ముడులువేయనా

మన కలయిక చెదరని చెలిమికి ఋజువని చరితలు చదివేలా

Wednesday, September 5, 2007

Manmadhudu - nEnu nEnugA lEnE

నేను నేనుగా లేనే


నేను నేనుగా లేనే నిన్న మొన్నలా

లేని పోని ఊహల్లో ఏమిటో ఇలా

ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా

ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా


పూల చెట్టు ఊగినట్టు పాల బొట్టు చిందినట్టు

అల్లుకుంది నా చుట్టు ఓ చిరునవ్వు

తేనె పట్టు రేగినట్టు వీణ మెట్టు ఒణికినట్టు

ఝల్లుమంది గుండెల్లో ఎవరే నువ్వు

నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన

మీకెవరికి కనిపించదు ఏమైనా


చుట్టుపక్కలెందరున్నా గుర్తు పట్టలేక ఉన్నా

అంతమంది ఒక్కలాగే కనబడుతుంటే

తప్పు నాది కాదు అన్నా ఒప్పుకోరు ఒక్కరైనా

చెప్పలేని నిజమేదో నాకూ వింతే

కళ్ళను వదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో

చెప్పవ కనురెప్పలకే మాటొస్తే