Showing posts with label Movie - Gulabi. Show all posts
Showing posts with label Movie - Gulabi. Show all posts

Tuesday, September 4, 2007

Gulabi - ee vELalO

ఈ వేళలో


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో

అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నా గుండె ఏనాడో చేజారి పోయింది

నీ నీడగా మారి నావైపు రానంది

దూరాన ఉంటూనే ఏంమాయ చేశావో


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో

అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను


నడి రేయిలో నీవు నిదరైన రానీవు

గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము

పగలైనా కాసేపు పని చేసుకోనీవు

నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది

నువు కాక వేరేదీ కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది

నీ మాట వింటూనే ఏం తోచనీకుంది

నీ మీద ఆశేదో నను నిలవనీకుంది

మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో

అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను


Monday, September 3, 2007

Gulabi - e rOjaitE

ఏ రోజైతే చూసానో నిన్ను


ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను

కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా

నీ ఊపిరినై నే జీవిస్తున్నాను

నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో

నీ రూపే నా వేచే గుండెల్లో

నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే

ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా

నీ కష్టంలో నేను ఉన్నాను

కరిగే నీ కన్నీరవుతా నేను

చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి

నీ ఏకాంతంలో ఓదార్పౌతాను


కాలం ఏదో గాయం చేసింది

నిన్నే మాయం చేసానంటోంది

లోకం నమ్మి అయ్యో అంటోంది

శోకం కమ్మి జోకొడతానంది

గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా

ఈ జీవం నీవని సాక్షం ఇస్తున్నా

నీతో గడిపిన ఆ నిమిషాలన్ని

నాలో మోగే గుండెల సవ్వడులే

అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా

నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా


నీ కష్టంలో నేనూ ఉన్నాను

కరిగే నీ కన్నీరవుతా నేను

చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి

నీ ఏకాంతంలో ఓదార్పౌతాను

ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను

కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా

నీ ఊపిరినై నే జీవిస్తున్నాను