ఏదారెదురైనా
ఏంతోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా
ఊరికినే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా
కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా
ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా
ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్నడుగుతువున్నా
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు !
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన గుస గుస కబురుల ఘుమ ఘుమ లెవరివి !
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూనే ఉంటా ఎపుడూ పూర్తవనే అవక
తుది లేని కథ నేనుగా
గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు ఏ చోటా నిలకడగ
ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తోందో కేక…. మౌనంగా !
నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దు అనొద్దు దయుంచి ఎవరు
ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు
నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది
నా ఎద లయను కుశలము అడిగిన
గుస గుస కబురుల ఘుమ ఘుమలెవరివి
లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం
నాకే సొంతం అంటున్నా... విన్నారా !
నేను, నా నీడ ఇద్దరమే చాలంటున్నా
రాకూడదు ఇంకెవరైనా
అమ్మ ఒడిలో మొన్న, అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది జాబిల్లి
అంత దూరానున్నా వెన్నెలగా చెంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది... జోలాలి !