Saturday, April 5, 2008

Jalsa - Ni Payanam Ekkadiko

నీ పయనం ఎక్కడికో

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

చంపనిదే బతకవనీ బతికేందుకు చంపమనీ

నమ్మించే అడవిని అడిగేం లాభం బతికే దారెటనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ

తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా

ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

ధీరులకీ దీనులకీ అమ్మ ఒడి ఒక్కటే

వీరులకీ చోరులకీ కంటతడి ఒక్కటే

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

అపుడెపుడో ఆటవికం మరి ఇపుడో ఆధునికం

యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం

రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎపుడో సొంత ముఖం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

తారలనే తెంచగలం తలుచుకుంటే మనం

రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ ఛలోరే ఛలోరే చల్ చల్

1 comment:

  1. సంహారం సహజమనీ సహవాసం స్వప్నమనీ తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శతృవనీ ... so true ...

    రాముడిలా ఎదగగలం .. రాక్షసులను మించగలం

    రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం, ఎపుడో సొంత ముఖం

    aahaa .. ohoo ..

    రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం

    kevvvvvu ... keka .. :-)

    each line is awesome ...

    ReplyDelete