Sunday, February 24, 2008

Vaana - mUti muDucukunnadE

మూతి ముడుచుకున్నదే


మూతి ముడుచుకున్నదే మువ్వంటి మైన

అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన

మాట వరసకైనా తనకు చెప్పనంటు

గీటుదాటకన్నా లెక్కచేయనంటు

ఆమె గారి చేయి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా

రానందా రమ్మన్నా


సన్నాయిలా వినిపిస్తున్నవా చెవికొరికి పోయే చిరుగాలులు

జడివానలా అనిపిస్తున్నవా జడపూల చాటున తడి ఊహలు

ఇన్నాళ్ళు నువ్వైన చూసావటే నీక్కూడ ముద్దొచ్చే అందాలు

ఇవ్వాళె నీకు తెలిసాయటే ఛీపాడు అనిపించు అర్ధాలు

ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోన

బాగుందే ఏమైనా


ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్ళోంచి నువ్వు దిగి వెళ్ళావని

పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని

పైటొచ్చి నీ జట్టు కట్టుకుందనీ ఆటాడె ఈడింక చేరనన్నది

పారాణి కేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది

గుండెలో గువ్వలా తెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేన

పంపాలే ఏమైనా

No comments:

Post a Comment