Sunday, February 24, 2008

Vaana - mUti muDucukunnadE

మూతి ముడుచుకున్నదే


మూతి ముడుచుకున్నదే మువ్వంటి మైన

అరె మబ్బేల దిగనంది ముత్యాల వాన

మాట వరసకైనా తనకు చెప్పనంటు

గీటుదాటకన్నా లెక్కచేయనంటు

ఆమె గారి చేయి జారి మనసు గాని పారిపోయిందా ఏమైనా

రానందా రమ్మన్నా


సన్నాయిలా వినిపిస్తున్నవా చెవికొరికి పోయే చిరుగాలులు

జడివానలా అనిపిస్తున్నవా జడపూల చాటున తడి ఊహలు

ఇన్నాళ్ళు నువ్వైన చూసావటే నీక్కూడ ముద్దొచ్చే అందాలు

ఇవ్వాళె నీకు తెలిసాయటే ఛీపాడు అనిపించు అర్ధాలు

ఇంతలో ఇంతలా ఎంత వింత మార్పు వచ్చిందే నీలోన

బాగుందే ఏమైనా


ఉయ్యాలకే ఉలుకొచ్చిందట ఒళ్ళోంచి నువ్వు దిగి వెళ్ళావని

పట్టీల అడుగే అలిగిందట చెట్టెక్కడం మానుకున్నావని

పైటొచ్చి నీ జట్టు కట్టుకుందనీ ఆటాడె ఈడింక చేరనన్నది

పారాణి కేమంత బరువుందని పాదాన్ని పరిగెత్తనీయకున్నది

గుండెలో గువ్వలా తెంచుకున్న నిన్ను పిలిచిందే ఓ మేన

పంపాలే ఏమైనా

Vaana - sirimalle vAna

సిరిమల్లె వాన


సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి

వడగళ్ళ వాన ఉరిమింది ఐనా వినిపించదే జంటకి

తడిసే తరుణాన గొడుగై నే లేనా


వల అనుకోనా వలపనుకోనా కలిపిన ఈ బంధం

వలదనుకున్నా వరమనుకున్నా తమరికి నే సొంతం

చినుకై వచ్చావే వరదై ముంచావే


చిలిపిగ ఆడి చెలిమికి ఓడి గెలిచా నీపైన

తగువుకు చేరి తలపుగ మారి నిలిచా నీలోన

మనసే ఈ వింత మునుపే చూసిందా

Vaana - unnaTTA lEnaTTA

ఉన్నట్టా లేనట్టా


ఉన్నట్టా లేనట్టా ఉండుంటే నిన్నేట్టా చేరాలె సిరి తునుక

విన్నట్టా లేనట్టా వింటుంటే నా మాట ఊకొట్టవే చిలక

నిదర చెడిన ఎద కుదుట పడదు కద

ఏదో చేసుంటావే నువ్వు అమ్మాయీ అన్యాయంగా


తెలుసుకోనీ ఆకాశవాణి చెలియ వైనాన్ని

అడుగుపోనీ ఆ చిన్నదాన్ని నన్ను కలవమని

ఏమంత పని ఉందని పారిపోయింది సౌదామిని

ఏ సంగతీ చెప్పక


మెరుపుతీగా! నీ మెలిక నాలో మిగిలిపోయిందే

చిలిపి సైగా! నా మనసు నీతో వలస పోయిందే

నువ్వు తాకినట్టుండగా ఓ తడి గొంతు వదిలావుగా

మరచి పోనివ్వక

Vaana - DhOlArE dhumAraM dEkhOrE

ఢోలారే ధుమారం దేఖోరే


ఢోలారే ధుమారం దేఖోరే

అరే అరే అనరే బాపురే

ఝూమోరే ఝమాఝం నాచోరే

హుర్రే హుర్రే అనదా ఊపిరే

అరె పిల్లగాలి పలికిందా సన్నాయి పాటలా

అరె కళ్ళలోన కులికిందా హరివిల్లు నేడిలా

కింద మీద చూడనంటు సందడేదొ ఆగనంటు

బొంగరాల గింగిరాల చందనాలు రేగు వేళ


మనింటిలో వేడుక విన్నంతటా హంగామా

కళ్యాణమే చూడగ ఖంగారు కలిగిద్దామా

జగాలకే చాటుగా జువ్వల్ని ఎగరేద్దామా

చుట్టాలుగా చేరగా చుక్కల్ని దిగమందామా

ఈవాళే రావాలి పగలే ఇలా

రంగేళి రేగాలి నలువైపులా

నింగి నేల ఏకమైన రంగ రంగ వైభవాన

ఛంగు ఛంగు ఛంగుమంటు చిందులాట సాగువేళ


ఢోలారే ధుమారం దేఖోరే

అరే అరే అనరే బాపురే


పొద్దెక్కినా లేవక బజ్జోకుమా పాపాయి

నెత్తెక్కి తొక్కేతనం అత్తింటిలో ఆపేయి

కుర్రాళ్ళతో దీటుగ కుంగ్ఫులవీ మానేయి

ఎన్నాళ్ళే ఈ వాలకం ఇల్లలుగా అడుగెయ్యి

అమ్మయ్యి లోకాన్నే అమ్మాయివై

తీరంత మార్చాలి ఆరిందవై

పిల్లతాను నీ బడాయి చెల్లదింక ఆకతాయి

అల్లరంత ఇక్కడొదిలి పల్లకీని చేరువేళ


ఢోలారే ధుమారం దేఖోరే

అరే అరే అనరే బాపురే

Vaana - eduTa niliciMdi cUDu

ఎదుట నిలిచింది చూడు


ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో

ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో

మైమరచిపోయా మాయలో

ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా


నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి

కలే ఐతే ఆ నిజం ఎలా తట్టుకోవాలి

ఔనో కాదో అడగకంది నా మౌనం

చెలివో శిలవో తెలియకుంది నీ రూపం

చెలిమి బంధమల్లుకుందే జన్మ ఖైదులా


నిన్నే చేరుకోలేక ఎటెళ్ళిందొ నా లేఖ

వినేవారు లేక విసుక్కుంది నా కేక

నీదో కాదో రాసున్న చిరునామా

ఉందో లేదో ఆ చోట నా ప్రేమ

వరంలాంటి శాపమేదో సొంతమైందిలా


*************************

వెంట పడుతుంది చూడు

కనపడని మంట ఏదో

బదులు అడిగింది నేడు

వినపడని విన్నపమేదో

మది మునిగిపోయే మత్తులో

మధురమైన యాతనేదో బైటపడదెలా

Vaana - AkASa gaMga

ఆకాశ గంగా


ఆకాశ గంగా దూకావె పెంకితనంగ

జల జల జడిగ తొలి అలజడిగ

తడబడు అడుగా నిలబడు సరిగా

నా తలకు ముడివేస్తున్నా నిన్నాపగా


కనుబొమ్మ విల్లెత్తి ఓ నవ్వు విసిరావె

చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావె

చిటపటలాడి వెలసిన వాన

మెరుపుల దారి కనుమరుగైనా

నా గుండె లయలో విన్నా నీ అలికిడి


ఈ పూట వినకున్నా నా పాట ఆగేనా

ఏ బాటలోనైనా నీ పైటనొదిలేనా

మనసుని నీతో పంపిస్తున్నా

నీ ప్రతి మలుపు తెలుపవె అన్నా

ఆ జాడలన్నీ వెతికి నిన్ను చేరనా


*************************

ఆకాశ గంగ నిన్ను ఆపలేనే ఇంక

ముగిసిన కథగా మిగలని స్మృతిగ

కదలవె త్వరగా కడలికి జతగ

ఈ మంచు కొండని విడచి వెళ్ళాలిగా