మళ్లీ పుట్టనీ
ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మిణుకు మిణుకు మంటోంది
మనిషిగ బతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణమై ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
ఇందిందిరానందమిది - ఇందీవర మరందమిది
మళ్లీ పుట్టనీ
ఉప్పొంగిన సంద్రంలా
ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలనే ఆశ
కొడిగట్టే దీపంలా
మిణుకు మిణుకు మంటోంది
మనిషిగ బతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై
కళ్ళల్లో జీవమై
ప్రాణమై ప్రాణమై
మళ్లీ పుట్టనీ నాలో మనిషిని
తెలుగమ్మాయి
రాయలసీమ మురిసిపడేలా
రాగలవాడి జన్మ తరించేలా
ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది
మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి తెలుగమ్మాయి
కళ్ళల్లో వెన్నెలై వెలుగమ్మాయి
అందుకోమన్నది నిన్ను తన చేయి
పలికే పలుకులో కొలికే తొలకరి
ఇంట్లో కురిసిందో సిరులే మరి
నవ్వే నవ్వుల్లో తుళ్ళే లాహిరి
జంటై కలిసిందో తలపే హరి
హంసల నడకల వయారి అయిన
ఏడడుగులు నీ వెనకే
ఆశల వధువుగ ఇలాగ ఇలపై
జారిన జాబిలి తునకే తెలుగమ్మాయి తెలుగమ్మాయి
గీతలే అని చిన్న చూపెందుకు
వాటి లోతులు చూడలేవెందుకు
నదిలో పడవలా, వానలో గొడుగులా
గువ్వపై గూడులా, కంటిపై రెప్పలా
జతపడే జన్మకి తోడు ఉంటానని
మనసులో మాటని మనకు చెప్పకనే చెబుతుంది తెలుగమ్మాయి
గుండెనే కుంచెగా మలచిందోయి
నీకోసం
ఎపుడూ లేని ఆలోచనలు
ఇపుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈలోకమిలా ఏదో కలలా
నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నాలో ఈ ఇది ఏరోజూ లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే నాకని పుట్టుంటావని
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నేనిన్నాళ్ళుగా
నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది
వీణే పలకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వది మోనాలీసది
ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మను
అహో ఒక మనసుకు నేడే
అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
అహో తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు
మాట పలుకు తెలియనిది
మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయె
కవితలు రాసే మౌనమది
రాగల రోజుల ఊహలకి
స్వాగతమిచ్చే రాగమది
శృతిలయలెరుగని ఊపిరికి
స్వరములు కూర్చే గానమది
ఋతువుల రంగులు మార్చేది
కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది
మనసున కదిలిన మృదునాదం
కలవని దిక్కులు కలిపేది
నింగిని నేలకు దింపేది
తనే కదా వారధి
క్షణాలకే సారధి మనస్సనేది
చూపులకెన్నడు దొరకనిది
రంగు రూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు
స్వప్నాలెన్నో చూపినది
వెచ్చని చెలిమిని పొందినది
వెన్నెల కళగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి
బాటను చూపే నేస్తమది
చేతికి అందని జాబిలిలా
కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కోయిలలా
కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి
అమృతవర్షిని అనిపించే
అమూల్యమైన పెన్నిధి
శుభోదయాల సన్నిధి మనస్సనేది