ఆనతినీయరా హరా
ఆనతినీయరా హరా
సన్నుతిసేయగా సమ్మతినీయరా దొరా! సన్నిధిజేరగా
ఆనతినీయరా హరా
నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాల వాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆయోగమాయతో మురారి దివ్యపాలనం
వసుమతిలో ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివా
ఆనతినీయరా హరా
అచలనాధ అర్చింతునురా
ఆనతినీయరా
జంగమదేవర సేవలు గొనరా
మంగళదాయక దీవెనలిడరా
సాష్టాంగముగ దండము చేతురా
ఆనతినీయరా
శంకరా శంకించకుర
వంకజాబిలిని జడను ముడుచుకుని
విషపునాగులను చంకనెత్తుకుని
నిలకడనెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేయిని
నీ కింకనుక సేవించుకుందురా
ఆనతినీయరా
రక్షా ధర శిక్షాదీక్ష ద్రక్షా విరూపాక్ష
నీ కృపావీక్షనాపేక్షిత ప్రతీక్షనుపేక్ష చేయక
పరీక్ష చేయక రక్ష రక్షయను ప్రార్ధన వినరా
ఆనతినీయరా హరా
సన్నుతిసేయగా సమ్మతినీయరా