మానస వీణ
మానస వీణ మౌన స్వరాన
ఝుమ్మని పాడే తొలి భూపాళం
పచ్చదనాల పానుపుపైన
అమ్మై నేల జోకొడుతుంటే
పున్నమి నదిలో విహరించాలి
పువ్వుల ఒళ్ళో పులకించాలి
పావురమల్లే పైకెగరాలి
తొలకరి ఝల్లై దిగిరావాలి
తారల పొదరింట రాతిరి మజిలి
వేకువ వెనువెంట నేలకు తరలి
కొత్త స్వేచ్ఛకందిచాలి నా హృదయాంజలి
వాగు నా నేస్తం చెలరేగే
వేగమే ఇష్టం వరదాయే
నింగికే నిత్యం ఎదురేగే
పంతమే ఎపుడూ నా సొంతం
ఊహకు నువ్వే ఊపిరిపోసి
చూపవె దారి ఓ చిరుగాలి
కలలకు సైతం సంకెల వేసి
కలిమి ఎడారి దాటించాలి
తుంటరి తూనీగనై తిరగాలి
దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి
పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి