Sunday, July 27, 2008

Pattudala - Eppudu Oppukovaddura

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏ క్షణం

విస్మరించవద్దు నిర్ణయం

అప్పుడే నీ జయం నిశ్చయంరా


నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా

ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారెదెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా

నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటయ్యితే


నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పిడుగువంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా

ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదనుతొక్కి అవధులన్ని అధిగమించరా

విధిత్తమాపరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా

జలధిసైతం ఆపలేని జ్వాలవోలె ప్రజ్వలించరా


నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా

సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల మొప్ప ముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గి ఉండ సాగరాన నిదుకుంటు తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ సూర్యగోళమంటిదేనురా

Pattudala - Amavasya Reyi

అమావాస్య రేయి


అమావాస్య రేయి అలా ఆగిపోయి

ఉషాకాంతినే నిషేధించునా

నిషా నిదురలో సదా నిలుచునా


ప్రపంచాన నీకన్నా దీనులెవరు లేరా

ప్రతీవారు నీకున్నా ప్రతిభ ఉన్న వారా

ఉలిని వలచి రాళ్ళైనా కళను తెలుసుకోవా

ఉనికి మరచి ఈ రత్నం వెలుగు విడచెనేల

వసంతాలు రావా సుగంధాలు తేవా

నిజం తెలుసుకోవా నిషావదులుకోవా


జగాలేలు జాబిల్లి మహా ఒంటివాడు

తన అనే తోడేదీ సమీపాన లేదు

ఎదను రగులు వేడున్నా వెలిగి తెలియనీడు

జనులు నిదుర పోతున్నా అలిగి తొలగిపోడు

సుధాకాంతి పంచే విధిని మానుకోడు

యధాశక్తి చూపే కళను దాచుకోడు

Saturday, July 19, 2008

Hare Ram - Inkonchem Freedom

ఇంకొంచెం ఫ్రీడం


ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం - పొందిగ్గా ఉండం, పరిగెడుతూ ఉందాం!

పక్షుల్లా పోదాం, నక్షత్రాలౌదాం! - నింగి అందాలందాం, నిచ్చెనలు వేద్దాం!

భూలోకం మొత్తం మనకేగా సొంతం - జనమంటే అర్థం మన జంటే అందాం!

ఎవరూ లేరందాం, ఉన్నా అటు చూడం! తొలి ఈవ్ అండ్ ఆడం మనమే అందాం!

హరిలో రంగ హరి, ఇదేం తమాషే! కాదన్న వాడే జోడీ ఖరార్, ఖల్లాసే!

భాగోతం బాగు అన్నావో సరే, శభాషే! ఐసే తైసే నువ్వంటే న్యూసే !

ఆనందోబ్రహ్మ అంటూ షికారు చేస్తే, అమ్మోరు పూనినట్టు వీరంగం వేస్తే,

ఏం దారి చోరా చోరీ తోచింది చేస్తే , చూస్తే గీస్తే మంటే మటాషే!

జంట కుదిరిన జోషే ఇక వెంట పడితే వెంట పడక ఒంటి కళతో ఉంటదా?

నిష్ట చెదిరిన మనసే వింటదా చెబితే,

కత్తి పదునై కోసే ఈ కొత్త చినుకు గుండె కొరుకుతుంటె కునుకు పడతదా!

నరం నరం నములు గరం గరం గుబులు క్షణం క్షణం దిగులు పిచ్చే కదా?

అదో రకం తెగులు, అయోమయం సెగలు పుట్టించడం తగని పనే కదా!


లోకుల్లారా, దీవిస్తే మీకే మేలంటాం, కాకుల్లాగా కవ్విస్తే కేర్--పిన్ అంటాం!

ఏం చేస్తారో మీ ఇష్టం, మాకేంటనుకుంటాం! మునుముందుకు పోదాం, ఆగం మీ కోసం!

Sayonara, చెయ్యేసి షైరుకు వెళుతున్నాం! సై అన్నారా, సరదాగా సంగతి చెప్పుకుందాం!

కాదన్నారా, que sera sera అనుకుందాం! అస్సలెందుకులే మీ అందరి ఒప్పందం?

కాపేస్తే కంచెను తెంచుకుపోతాం, ఆపేస్తే తప్పక తప్పుకుపోతాం!

కోపిస్తే కొండల నుంచి కిందికి వచ్చి గట్టును తెంచి కొంపలు ముంచే గోదారైపోదాం!

ఆవారా గాళ్ళని నిందిస్తారా? కెరటాలకు కొరడా చూపిస్తారా?

గుప్పెట్లో నిప్పును పట్టి కప్పడమంటే ముప్పని ఎవరూ చెప్పక ముందే తెలిసిందటే నీకే లాభం!


జై రాం, జై రాం, జై జై జై రాం, జై రాం, జై జై జై రాం జై రాం, జై జై జై జై రాం!

Friday, July 11, 2008

Hare Ram - Ya Khuda

యా ఖుదా


ప్యార్ కర్నా సీఖోనా

పారిపోతే పరువేనా

కోరుకుంటే ఏదైనా నే కాదంటానా

యా ఖుదా జర దేఖోనా

దూకుతున్నది పైపైన

దిక్కు తోచక ఛస్తున్నా

ఏం జోరే జాణ

పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి

పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి

పట్టపగలే వచ్చి బరితెగించి

పచ్చి వగలే తెచ్చి వెంట రాకె కొంటెగా కవ్వించి


ప్యార్ కర్నా సీఖోనా

పారిపోతే పరువేనా

కోరుకుంటే ఏదైనా నే కాదంటానా

యా ఖుదా జర దేఖోనా

దూకుతున్నది పైపైన

దిక్కు తొచక ఛస్తున్నా

ఏం జోరే జాణ


ఒంటరి ఈడు కదా

తుంటరి తొందర ఉండదా

ఎందుకు ఈ పరదా తగునా

అందుకు ఆడ జత తప్పక అవసరమే కదా

నువ్వది కాదు కదా అవునా

ఇంతలేసి కళ్ళు మొత్తం కట్టి వేసుకు కూర్చున్నావ

నన్ను చూస్తే కొంచెమైనా గుండె తడబడుకుంటుందా

బాప్ రే బాప్ తెగ బెదిరానే నమ్మవేం చెబుతున్నా

గాభరా పడుతున్నానే చాలదా పులి కూనా


ప్యార్ కర్నా సీఖోనా

పారిపోతే పరువేనా

కోరుకుంటే ఏదైనా నే కాదంటాన

యా ఖుదా జర దేఖోనా

దూకుతున్నది పైపైన

దిక్కు తొచక ఛస్తున్నా

ఏం జోరే జాణా


దక్కిన చుక్కనిలా

తక్కువ చేయకు ఇంతలా

మక్కువ దాచకలా మదిలో

కమ్ముకు రాకే ఇలా

తిమ్మిరి పెంచకె వింతగా

గమ్మున ఉండవెలా తెరలో

ఆశపడితే దాగుతుందా రాచకార్యం ఇన్నాళ్ళుంటే

మూతపెడితే దాగుతుందా చాలు రాదది జోకొడితే

క్యా కరే నాకేం దారి నౌకరీ పోతుంటే

పోకిరి వైఖిరి చాలే ఛోకిరి వదిలెయ్వే


ప్యార్ కర్నా సీఖోనా

పారిపోతే పరువేనా

కోరుకుంటే ఏదైనా నే కాదంటాన

యా ఖుదా జర దేఖోనా

దూకుతున్నది పైపైన

దిక్కు తొచక ఛస్తున్నా

ఏం జోరే జాణా


పుట్టుకొచ్చే పిచ్చి నువ్వు నచ్చి

పట్టుకొచ్చా మెచ్చి పంచుకోవే లవ్ రుచి

పట్టపగలే వచ్చి బరితెగించి

పచ్చి వగలే తెచ్చి వెంట రాకే కొంటెగా కవ్వించి

Hare Ram - Lalijo Lalijo

లాలిజో లాలిజో


లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ

జోలలో జారిపో మేలుకోలేనంతగ

ఆపదేం రాదే నీ దాక నేనున్నాగ

కాపలా కాస్తూ ఉంటాగ

పాపలా నిదరో చాలింక

వేకువగా దీపమై చూస్తూ ఉంటాగ

కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని

కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని


లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

జోలలో జారిపో మేలుకోలేనంతగా


ఊరికే ఉసూరుమంటావే

ఊహకే ఉలిక్కిపడతావే

చక్కగా సలహాలిస్తావే

తిక్కగా తికమకపెడతావే

రెప్పలు మూసుంటే తప్పక చూపిస్తా

రేయంతా వెలిగించే రంగుల లోకాన్నే


కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని

కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని


లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

జోలలో జారిపో మేలుకోలేనంతగా


ఎదురుగా పులి కనపడుతుంటే

కుదురుగా నిలబడమంటావే

బెదురుగా బరువెక్కిందంటే

మది ఇలా భ్రమపడుతున్నట్టే

గుప్పెడు గుండెల్లొ నేనే నిండుంటే

కాలైనా పెట్టవుగా సందేహాలేవే

ఆపదేం రాదే నీదాక నేనున్నా

కాపలా కాస్తూ ఉంటాగా

పాపలా నిదరో చాలింకా వేకువదాక

దీపమై చూస్తూ ఉంటాగా


కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని

కానీ అనుకోనీ అలివేణి

ఏం కాలేదనుకోనీ వదిలేసి వెళ్ళిపోనీ ఆరాటాన్ని


లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగా

జోలలో జారిపో మేలుకోలేనంతగా

Thursday, July 10, 2008

Hare Ram - Sariga Padani

సరిగా పడనీ


సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు

సుడిలో పడవై ఎపుడూ తడబడకు

మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు

వేకువై వెలగనీ తెరవిదే నీ కళ్లు

కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే

మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే

కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే

ఛలో ఛలో


నిన్నే చూసే అద్దం కూడ నువ్వా కాదా అనదా

అచ్చం నీలా ఉండేదెవరా అంటు లోకం ఉలికిపడదా

సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం

దీపంలా వెలిగిందా జనులందరిలో

చంద్రుళ్ళో మచ్చల్లే అనిపించే ఏదో లోపం

కుందేలై అందంగా కనపడదే నీలా నవ్వే క్షణాలలో


చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసి

తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి

అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు

అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు

అందరికి బతుకిచ్చే పోరాటంలో ముందుండు

కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు

ఛలో ఛలో

Tuesday, July 1, 2008

Abhinandana - Prema Ledani

ప్రేమ లేదని


ప్రేమ లేదని ప్రేమించరాదని

ప్రేమ లేదని ప్రేమించరాదని

సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ

ఓ ప్రియా జోహారులు


మనసు మాసిపోతే మనిషే కాదని

కటిక రాయికైనా కన్నీరుందని

వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని

గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ

ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి

ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి

మోడుబారి నీడ తోడు లేకుంటిని


గురుతు చెరిపివేసి జీవించాలని

చెరపలేకపోతే మరణించాలని

తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని

గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ

ముక్కలలో లెక్కలేని రూపాలలో

ముక్కలలో లెక్కలేని రూపాలలో

మరల మరల నిన్ను చూసి రోదించనీ

Abhinandana - Prema Enta Madhuram

ప్రేమ ఎంత మధురం


ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం

చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం

మింగినాను హలాహలం


ప్రేమించుటేనా నా దోషము

పూజించుటేనా నా పాపము

ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు

కన్నీరుగ ఈ కరిగే కళ్ళు

నాలోని నీ రూపము

నా జీవనాధారము

అది ఆరాలి పోవాలి ప్రాణము


నేనోర్వలేను ఈ తేజము

ఆర్పేయరాదా ఈ దీపము

ఆ చీకటిలో కలిసే పోయి

నా రేపటిని మరిచే పోయి

మానాలి నీ ధ్యానము

కావాలి నే శూన్యము

అపుడాగాలి ఈ మూగ గానం

Abhinandana - Ade Neevu Ade Nenu

అదే నీవు అదే నేను


అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

అదే నీవు అదే నేను అదే గీతం పాడనా

కథైనా కలైనా కనులలో చూడనా


కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము

కొండా కోన గుండెల్లో ఎండావానలైనాము

గువ్వ గువ్వ కౌగిల్లో గూడు చేసుకున్నాము

అదే స్నేహము అదే మోహము

అదే స్నేహము అదే మోహము

ఆది అంతం ఏదీ లేని గానము


నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

నిన్నా రేపు సందెల్లో నేడై ఉందామన్నావు

కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు

అదే బాసగా అదే ఆశగా

అదే బాసగా అదే ఆశగా

ఎన్నిన్నాళ్ళీ నిన్న పాటే పాడను

Subhalekha - Raagala Pallakilo

రాగాల పల్లకి లో

లాలా ల ల లల లలాలా
రాగాలా పల్లకిలో కోయిలమ్మ రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
....
నా ఉద్యోగం పోయిందండి!!! ...తెలుసు... అందుకే
....
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ..
రాలేదు ఈ వేళా కోయిలమ్మా రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా .. ఎందుకమ్మా

పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ..

మూగ తీగ పలికించే వీణలమ్మకీ..
బహుశా ఆది తెలుసో ఏమో
బహుశా ఆది తెలుసో ఏమో..

జాణ కోయిలా రాలెదూ ఈ తొటకి ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా రాలెదూ ఈ వేళా అందుకేనా.. అందుకేనా..

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ..

కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
బహుశా తను ఎందుకనేమో ..
లల లాలా లాలలల లాలా..
బహుశా తాను ఎందుకనేమో .. గడుసు కోయిలా ..

రాలేదు ఈ తొటకీ ఈ వేళా..

రాగాలా పల్లకిలో కోయిలమ్మా.. రానేలా నీవున్తే కూనలమ్మ..
రాగాలా పల్లకిలో కోయిలమ్మ.. రానేలా నీవున్తే కూనలమ్మ..


Lakshmi Nivaasam - Dhanamera Annitiki Moolam

ధనమేరా

ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
ధనమేరా అన్నిటికి మూలం

మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
మానవుడే ధనామన్నది స్రుజియించెనురా దానికి తనే తెలియని దాసుడాయెరా
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
ధనలక్శ్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా

..
ధనమేరా అన్నిటికి మూలం..

ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
ఉన్ననాడు తెలివికలిగి పొదుపుచేయరా లేనినాడు ఒడలు వంచి కూడబెట్టరా
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే
హయ్యో కూలి పోవు కాపురాలు ఇది తెలియకుంటే..

ధనమేరా అన్నిటికీ మూలం
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
కూలివాని చెమటలో ధనమున్నదిరా
పాలికాపు కండల్లొ ధనమున్నదిరా
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
శ్రమజీవికి జగమంతా లక్శ్మీనివాసం
ఆ శ్రీదేవిని నిరశించుత తీరని ద్రొహం

ధనమేరా అన్నిటికి మూలం ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం