గోరొంకకెందుకో
గోరొంకకెందుకో కొండంత అలక
అలకలో ఏముందో తెలుసుకో చిలకా
కోపాలలో ఏదో కొత్తర్ధముంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
కోపాలలో ఏదో కొత్తర్ధముంది
గల్లంతులో ఏదో గమ్మత్తు ఉంది
ఉరుములు మెరుపులూ ఊరికే రావులే
ఉరుములు మెరుపులూ ఊరికే రావులే
వాన ఝల్లు పడునులె మనసు చల్లబడునులే
వాన ఝల్లు పడునులె మనసు చల్లబడునులే
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
మాటేమో పొమ్మంది మనసేమో రమ్మంది
మాటకు మనసుకు మధ్యన తగవుంది
తగవు తీరేదాకా తలుపు తీయొద్దులె
తగవు తీరేదాకా తలుపు తీయొద్దులె
ఆదమరచి అక్కడే హాయిగా నిదురపో