Oneway oneway
Oneway oneway జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది
తెలియదు అన్నా ఆగదే మరి సాగిపోయే ప్రయాణం
Runway లాటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది
ఎగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం
ఈ దారిలోన నవ్వు చిలకరించే మల్లె పూవులెన్నో
తీయ తీయగానె నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో
ఎంత వింతనీ తెలుసుకో ప్రపంచం
అంతు తేలని సృష్టిలో రహస్యం
జగమే ఒక మాయ బతుకే ఒక మాయ
అది అన్నది ఎవరో అది విన్నది ఎవరో
మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా
ఒక్క చూపుకై బతికే ఆ మాయలో హాయిలేగా
ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ mysteryకి
బదులు ఎవ్వరూ చెప్పలేరుగా అందుకే నేటి రోజే నీది
ఎంత చిన్నదో తెలుసుకో జీవితం
అంతకన్న అతి చిన్నదీ యవ్వనం
తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు
తను వెళ్ళే చోటే తెలుసా మరి మనకు
నిన్న అన్నదిక రాదు గతమంటె ఎందుకా మోజు
రేపు అన్న ఆ రోజు కలలాంటిదే కదా మనకు
ఎన్ని వేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం
కళ్ళు మూసి తెరిచేలోగా మారిపోతుంది నాటక రంగం
ఎంత చిత్రమో తెలుసుకో ప్రపంచం
తెలుసుకుంటె నీ సొంతమే సమస్తం